హ్యార్లీ డేవిడ్‌సన్‌ను ఓవర్‌టేక్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్

By Ravi

చెన్నైకి చెందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమెరికాకు చెందిన హ్యార్లీ డేవిడ్‌సన్‌ను ఓవర్‌టేక్ చేసింది. ఎందులో అనుకుంటున్నారా..? ఆ విషయానికి వస్తున్నా.. ప్రపంచవ్యాప్త అమ్మకాల (గ్లోబల్ సేల్స్) పరంగా రాయల్ ఎన్‌ఫీల్డ్, హ్యార్లీ డేవిడ్‌సన్‌ను ఓవర్‌టేక్ చేసింది.

గడచిన సంవత్సరం (2014)లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల యూనిట్లకు పైగా మోటార్‌‌సైకిళ్లను విక్రయిస్తే, హ్యార్లీ డేవిడ్‌సన్ 2.67 లక్షల యూనిట్లను విక్రయించింది. వాస్తవానికి ఇరు కంపెనీల మధ్య పోలిక సరైనది కాకపోయినప్పటికీ, నిజమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రియుల చెవులకు మాత్రం ఈ వార్త తీపిగానే అనిపిస్తుంది.

Royal Enfield Outsells Harley Davidson Globally

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలి కాలంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోవటం, అలాగే కంపెనీ తాజాగా ప్రవేశపెట్టిన కాంటినెంటల్ జిటి కెఫే రేసర్‌కు గ్లోబల్ మార్కెట్ల నుంచి మంచి స్పందన లభించడంతో కంపెనీ అమ్మకాలు జోరందుకున్నాయి.

మరోవైపు హ్యార్లీ డేవిడ్‌సన్ కూడా తమ అమ్మకాలను పెంచుకుని, మార్కెట్లో గట్టి పోటీనిచ్చేందుకు చవకైన స్ట్రీట్ 750 బైక్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ నుంచి లభిస్తున్న అత్యంత చవకైన మోటార్‌సైకిల్ కూడా ఇదే కావటం విశేషం.

గడచిన నెలలో కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రోత్సాహకర వృద్ధిని సాధిచింది. జనవరి 2015లో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో 43 శాతం వృద్ధిని, ఎగుమతుల్లో 82 శాతం వృద్ధిని కనబరిచింది.

Most Read Articles

English summary
Royal Enfield, the Chennai based company has managed to outsell Harley-Davidson globally. Royal Enfield sold over 3 lakh motorcycles in 2014, while the so claimed legendary Harley-Davidson has managed to sell just 2.67 lakh bikes in 2014.
Story first published: Tuesday, February 3, 2015, 12:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X