టి.వి.యస్ జూపిటర్ స్కూటర్ ప్రచారకర్తగా అమితాబచ్చన్
బాలీవుడ్‌లో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే టక్కుమని గుర్తొచ్చేది అమితాబచ్చన్ అలాంటి హీరో మొదటిసారిగా టూవీలర్ కు ప్రచాకర్తగా ఉండటానికి ఒప్పుకున్నారు. ఆయన టి.వి.యస్ కు చెందిన జూపిటర్ మోడల్‌కు ప్రచారకర్తగా ఉండటానికి ఆమోదం తెలిపాడు. ఈ ఆమోదం వలన పండుగ సీజన్‌లో జూపిటర్ స్కూటర్ విక్రయాలను ప్రోత్సహించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని టి.వి.యస్ ప్రతినిధులు పేర్కొన్నారు.
మరి అమితాబ్ ప్రమోట్ చేస్తున్న ఈ టి.వి.యస్ జూపిటర్ మీద ఓ లుక్కేసుకోండి..

అమితాబచ్చన్ :
బాలీవుడ్ స్టార్ హీరో అమితాబచ్చన్ తన జీవితంలో మొట్టమొదటి సారిగా ద్విచక్రవాహనాలకు ప్రచార కర్తగా అంగీరించారు. అది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు ద్విచక్ర వాహనాలను తయారుచేస్తున్న టి.వి.యస్ తో ఒప్పుకున్నాడు. ఇక మీదట టి.వి.యస్ జూపిటర్ స్కూటర్‌తో టి.వి లలో దర్శమివ్వనున్నారు. ఈ సంధర్బంగా టి.వి.యస్ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ పండుగ సీజన్‌లో అత్యధిక అమ్మాకాలు జరుగుతాయని హర్షం వ్యక్తం చేశారు.
మరి అమితాబచ్చన్‌ని టి.వి లో ఎలా కనబడబోతున్నాడో అని చూడాలని ఉందా ? ఇంకెందుకు ఆలస్యం పక్కనున్న వీడియో మీద ఓ కన్నేయండి. తరువాత స్లయిడర్స్ ద్వారా జూపిటర్ యొక్క ధర, ఇంజన్, మైలేజ్ మరియు స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకోగలరు.

ఇంజన్ :
జూపిటర్‌లో శక్తివంతమైన 109.7 సీసీ గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది మీకు 7.88 హార్స్‌పవర్ మరియు 8 ఎన్ఎమ్ అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అంతే కాకుండా టి.వి.యస్ మోటార్స్ వారు సి.వి.టి అనే ప్రైమరి మరియు సెకండరీ అనే గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్‌నిన ఇందులో అందించారు.

మైలేజ్ :
టి.వి.యస్ ఇంజనీర్లు ఇందులో ఎక్కువ మైలేజ్ కల్పించడానికి ఎంతో ఎక్కువగా శ్రమించారు. ఎందుకంటే ఇందులో ఇంటిలెంజెంట్ ఇగ్నిషన్ సిస్టమ్‌ని ఏర్పాటు చేశారు. దీని వలన ఇది మీకు దాదాపుగా లీటర్‌కు 62 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. మరియు ఇందులో పవర్ మరియు ఎకో డ్రైవింగ్ మోడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.

జూపిటర్ యొక్క అత్యధిక వేగం :
సరి కొత్త టి.వి.యస్ జూపిటర్ కేవలం 7.2 సెకండ్లలోనే 0-60 కెఎమ్/హెచ్ వేగాన్ని అందుకోగలదు మరియు హైవవే రోడ్ల మీద దీని అత్యధిక వేగం గంటకు 90 కిలోమీటర్లు.

లభించు రంగులు :
ఈ మధ్య కాలంలో స్కూటర్లను ఎంచుకునే వారు వాటి రంగులకు కూడా అధిక ప్రాధాన్యక ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో టి.వి.యస్ తమ జూపిటర్ మోడళ్లను ఐదు విభిన్న రంగుల్లో అందిస్తున్నారు.
- టైటానియం గ్రే
- స్పార్ల్కింగ్ సిల్వర్
- మిడ్ నైట్ బ్ల్యాక్
- వోల్కానో రెడ్
- ప్రిస్టైన్ వైట్
- జూపిటర్ స్టాండర్డ్ ట్రిమ్ ధర రూ. 50,398 .
- జూపిటర్ జెడ్ఎక్స్ ట్రిమ్ ధర రూ. 52,426.(రెండు ధరలు ఎక్స్-షోరూమ్, ముంబయ్)
- ఎక్ట్సర్నల్ ఫ్యూయల్ ఫిల్టర్
- రెండు వైపుల హ్యాండ్ లాక్
- సెంటర్ స్టాండ్
- అత్యధిక అండర్ సీట్ క్యారేజ్
- మొబైల్ ఛార్జింగ్
- మెటల్ బాడి

ధర :
స్కూటర్ కొనే ప్రతి ఒక్కరు మనం చెల్లించే ధరకు తగ్గ స్పెసిఫికేషన్స్ ఇందులో ఉన్నాయా? మన బడ్జెట్‌కు ఇది సరిపోయే స్కూటర్ ఇదేనా అని ఆలోచిస్తారు. అయితే మీరు చెల్లించే ధరకు సరైన స్కూటర్ జూపిటర్ అని చెప్పవచ్చు.

జూపిటర్ ఫీచర్స్ :
అన్నింటి కన్నా టి.వి.యస్ జూపిటర్ ఫీచర్ల పరంగా భారతదేశంలో ముందు వరుసలో ఉన్నందుకు తెగ గర్వపడుతోంది.

పోటి :
టి.వి.యస్ ఇప్పుడు ఎక్కువ స్కూటర్లుకు గట్టి పోటిగా నిలిచిందని చెప్పవచ్చు అందులో హోండా ఆక్టివా, మహీంద్ర గస్టో, సుజుకి లెట్స్, యమహా ఆల్ఫా మరియు హీరో మాయెస్ట్రో వంటి మోడళ్లకు ప్రస్తుతం మార్కెట్లో గట్టి పోటిని ఇస్తోంది.

టి.వి.యస్ లక్ష్యం :
ఈ మధ్యనే టి.వి.యస్ తన అపాచె మోడల్‌కు మట్టీ బ్లూ ఎడిషన్‌లో , స్టార్ సిటి ప్లస్ మోడల్‌ను గోల్డ్ ఎడిషన్‌లో విడుదల చేయడం మరియు అమితాబ్‌ను జూపిటర్ స్కూటర్‌కు ప్రమోటర్‌గా నియమించుకోవడం చూస్తే ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను పెంచుకునే లక్ష్యంతో టి.వి.యస్ మోటార్స్ ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








