కస్టమైజ్డ్ అల్ట్రా బైక్: దీని అత్యధిక వేగం 340 కి.మీ లు...!!
మిలాన్ లో జరిగిన మోటార్‌షో లో గత నెలలో రకరకాల టెక్నాలజీలను రకరకాల సంస్థలు ప్రపంచానికి పరిచయం చేశాయి. ఎన్ని కొత్త టెక్నాలజీలు వచ్చినా మనకు ఏ మాత్రం రుచించవు ఎందుకంటే అప్పటికే ఉన్న మోడల్లకే కొన్ని పై పైన మెరుగులుదిద్ది మనకు పరిచయం చేస్తుంటారు. చాలా వరకు ఎక్కువ మంది వీటిని ఇష్టపడరు. అందుకు వారి అభిరుచికి తగ్గట్లు తమ బైకులను రూపొందించే అవకాశం ఒక సంస్థ కల్పిస్తోంది.
Also Read: హోండా నుండి సిబియస్ ఐఎక్స్50 కాన్సెప్ట్ బైక్ విడుదల
2007లో అరోరా అనే వ్యక్తి ఈ రోడ్ రేజ్ కస్టమ్ బైక్ బిల్డ్ సంస్థను స్థాపించారు. ఈ కంపెనీ ముంబాయ్‌లో కలదు. వీరు మనకు నచ్చిన విధంగా మన బైకును రీమోడల్ చేస్తారు. అలా రీమోడల్ చేస్తున్నప్పుడు రూపొందించిన బైకే ఇది. ఇది గంటకు 340 కిలో మీటర్లు వేగంతో దూసుకెల్తుంది. ఈ సంస్థ ద్వారా బైక్‍ని ఎలా కావాలంటే అలా మార్చేసుకోవచ్చు. అయితే వీరు ఈ అల్ట్రా బైకును ఎలా రూపొందించారో క్రింది కథనాల ద్వారా తెలుసుకుందాం రండి.

దీనిని తమ ముందు కస్టమర్ అయిన రోనాక్ షాహ్ అనే వ్యక్తి తన కరిజ్మా బైక్‌ను ఇలా తనకు నచ్చిన విధంగా రోడ్ రేజ్ కస్టమ్ బిల్డి వారి సహకారంతో రూపొందించుకున్నాడు

అతని కోరిక ప్రకారం ఇలాంటి బైక్ ఎవరి దగ్గర కూడా ఉండకూడదు మరియు ఇలాంటి బైక్ ను ఎవరూ చూసి ఉండకూడదని ఇలా తయారు చేయించుకున్నాడని ఈ బైక్ రీమోడలింగ్ సంస్థ వారు తెలిపారు.

అతని అభీష్టం మేరకు, ఈ రోడ్ రేడ్ సంస్థ వారు మూడు రకాల బైకులను పరిగమలోకి తీసుకుని ఈ అల్ట్రా బైక్ ను రూపొందించారు. ఈ మూడు బైకుల నుండి స్ట్రీట్ బైక్ ఫీలింగ్, ఛాపర్ ఫీల్ మరియు స్పోర్టివ్ వంటి అంశాలను పరగణలోకి తీసుకున్నట్లు తెలిపారు.

దీని బాడి ఎంతో అందంగా ఉండేలా మార్పు చేయడానికి పూర్తిగా ఫ్రేమ్‌ను కొత్తగా డిజైన్ చేశారు. ఇందులో కెటియమ్ బైక్ యొక్క వెనుక గల స్వింగ్ ఆర్మ్ మరియు కెటియమ్ షాక్స్‌ను ఉపయోగించారు.

దీని ఫ్యూయల్ ట్యాంక్‌ను ప్రత్యేకంగా ఛాసిస్ ఉపరితలం మీద ఉండేట్లు డిజైన్ చేశారు. తద్వారా ఇందులో ఇద్దరు వ్యక్తులు సౌకర్యవంతంగా కలిసి ప్రయాణించేందుకు వీలు కలిగిందని తెలుపారు.

ఈ కస్టమైజ్డ్ అల్ట్రా బైక్ పూర్తిగా స్పోర్టివ్ అనుభూతిని కలిగిస్తుంది. పాదాలను సాఫిగా చాచుకుని రైడ్ చేయడానికి ఇందులో ఫూట్ రెస్ట్‌ను పొడిగించారు. ఈ నూతన డిజైన్‌లోని అంశాలను దీని నడుపుతున్నపుడు బాగా ఎంజాయ్ చేశానని ఈ బైక్ యాజమాని తెలిపాడు.

మొత్తంగా వీరు డిజైన్‌లో మార్పులు చోటు చేసుకునే అంశాలు- ఫ్రేమ్ వర్క్, కలర్ కాంబినేషన్, లైట్లు, చక్రాలు, టైర్లు మరియు హ్యాండ్లింగ్ వంటి వాటికి ఎక్కువగా మార్పులు చేర్పులు చేస్తారు. అయితే ఈ అల్ట్రా బైక్‌లో కూడా అచ్చం ఇలాంటి మార్పులే చోటు చేసుకున్నాయి.

ఇందులో ఉన్న హెడ్ లైట్‌ను గమనించినట్లు అయితే 8 వాట్ కెపాసిటి గల రెండు ఎల్‌ఇడి హెడ్ లైట్లను అమర్చారు. అందులో ఒక్కొక్క హెడ్ లైట్ యొక్క చుట్టు కొలత 1.5 ఇంచులు ఉంటుంది. అందువలన ఈ లైట్ అతి చీకటి ప్రదేశాలలో కూడా శక్తివంతమైన వెలుతురును ఇస్తాయి.

ఇక ఇందులో గల ఇన్‌బిల్ట్ టెయిల్ ల్యాంప్స్ మరియు బ్రేక్ లైట్ల్ దాదాపుగా కిలోమీటర్ వరకు వెలుగుతాయి. అందు కోసం ఇందులో ప్రత్యేకంగా అత్యంత శక్తివంతమైన యల్‌ఇడి లైట్లను ఉపయోగించారు.

ఎక్కువ మంది బైకులను తమకు నచ్చిన రంగుల్లో ఉండాలని కోరుకుంటారు, కాని వారికి నచ్చిన కలర్స్‌లో బైక్‌లు లభించవు. కాబట్టి వారికి నచ్చిన రంగుల్లో బైక్‌లను మోడిఫై చేస్తారు. ఇక ఈ అల్ట్రా బైక్ విషయానికి వస్తే ఇందలో ఉన్న ఛాసిస్‌కు ఫ్లోరో సెంట్ గ్రీన్ కలర్ మరియు ఇతర బాడి పరికరాలకు మ్యాట్ బ్లాక్ కలర్‌ను అందించారు.

టైర్లు: బండి ఎంత వేగంతో వెళితే ఏం లాభం టైర్లు, చక్రాలు సరిగా లేనప్పుడు. అందుకోసం ఈ అత్యంత వేగంవంతమైన బైకులో క్రోమ్ వీల్స్ కలవు. ఈ క్రోమ్ చక్రాలకు 170 ఎమ్ఎమ్ వెనుకవైపున మరియు 1210 ఎమ్ఎఎమ్ ముందు వైపున ఉండేట్లు టైర్లను అందించారు.

మరి మీకు కూడా ఇలాంటి బైక్ కావాలా అయితే, మీ బైక్‌ను ముంబాయ్‌కి తీసుకెళ్లి మీరు కూడా ఇలా మార్చేసుకోవచ్చు.

- మొట్టమొదటి 125సీసీ స్కూటర్‌ను పరిచయం చేసిన కవాసకి
- నువ్వా నేనా అంటున్న రాయల్ ఎన్ఫీల్ట్ మరియు బజాజ్ అవెంజర్
- 2016 లో రానున్న యమహా కొత్త బైక్ వైజడ్‌ఎఫ్-ఆర్1యస్


Click it and Unblock the Notifications