యమహా స్కూటర్లలో బ్లూ కోర్ టెక్నాలజీ, కొత్త కలర్ ఆప్షన్స్
జపనీస్ టూవీలర్ కంపెనీ యమహా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న స్కూటర్లలో తమ పాపులర్ బ్లూ కోర్ టెక్నాలజీని పరిచయం చేసింది. అంతేకాకుండా.. ఈ స్కూటర్లలో కంపెనీ కొత్త కలర్ ఆప్షన్లను కూడా పరిచయం చేసింది.
ప్రస్తుతం యమహా మోటార్ ఇండియా, భారత మార్కెట్లో రే, రే జెడ్, ఆల్ఫా స్కూటర్లను విక్రయిస్తోంది. ఇప్పుడు ఈ మూడు స్కూటర్లు కూడా బ్లూ కోర్ టెక్నాలజీతో పాటుగా, కొత్త కలర్ ఆప్షన్లలో లభ్యం కానున్నాయి.

హోండా అందిస్తున్న హెచ్ఈటి (హోండా ఈకో టెక్నాలజీ), సుజుకి అందిస్తున్న ఎస్ఈపి (సుజుకి ఈకో పెర్ఫార్మెన్స్) టెక్నాలజీల మాదిరిగానే ఈ యమహా బ్లూ కోర్ టెక్నాలజీ కూడా పవర్‌తో పాటుగా మైలేజ్‌ని మెరుగుపరచడంలో సహకరిస్తుంది.
బ్లూ కోర్ టెక్నాలజీతో వస్తున్న కొత్త 2015 యమహా స్కూటర్లకు, ఇదివరకే మార్కెట్లో ఉన్న స్కూటర్లకు మధ్య వ్యత్యాసాన్ని తెలిపేందుకు గాను కంపెనీ ఈ కొత్త మోడళ్లను సరికొత్త కలర్ ఆప్షన్లలో అందిస్తోంది. వీటి మైలేజీని 62 కెఎంపిఎల్ నుంచి 66 కెఎంపిఎల్‌కు పెంచారు.
బ్లూ కోర్ టెక్నాలజీతో లభ్యం కానున్న కొత్త 2015 యమహా స్కూటర్ల ధరలు ఇలా ఉన్నాయి:
- యమహా ఆల్ఫా - రూ.49,939
- యమహా రే - రూ.47,805
- యమహా రే జెడ్ - రూ.48,936

ప్రస్తుత ఇంజన్లతో పోల్చుకుంటే యమహా బ్లూ కోర్ టెక్నాలజీ కలిగి ఇంజన్లలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఈ కొత్త ఇంజన్లలో కంబస్టియన్‌ను మెరుగు పరచేందుకు నికెల్ స్పార్క్ ప్లగ్‌ను ఆఫర్ చేస్తున్నారు. మఫ్లర్ సెట్టింగ్, కొత్త బిఎస్ కార్బురేటర్, టిపిఎస్ సెట్టింగ్‌లను మార్చారు.


Click it and Unblock the Notifications








