బెంగళూరులో రెండు డీలర్‌షిప్‌లను ప్రారంభించిన యమహా
సమర్థవంతంగా, మరింత ఎక్కువగా కస్టమర్లకు చేరువయ్యేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా యమహా మోటార్స్ ఇండియా బెంగళూరులో రెండు కొత్త డీలర్‌షిప్‌లను ప్రారంభించింది.
అందులో ఒకటి 8వ మైల్, తుముకూరు రోడ్, బెంగళూరులో ఉన్న సునీల్ మెహతా మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది 5700 చదరపు అడుగుల్లో సేల్స్ మరియు సర్వీసులను అందిస్తోంది.

రెండవది బన్నేరుఘట్ట రోడ్డులోని లక్ష్మీ ఇంటర్నేషనల్. ఇది 6000 చదరపు అడుగుల్లో సేల్స్ మరియు సర్వీసులను అందిస్తోంది.
ఈ షోరూములు యమహా అందిస్తున్న మోడళ్లను ఒక స్థాయిలోనికి తేవడానికి ప్రారంభించబడ్డాయి. యమహా సరికొత్తగా అందిస్తున్న 125సీసీ సెలుటో స్కూటర్‌ను కూడా వీటిలో అందుబాటులో ఉంచారు.

యమహా నేటి యువత కోసం ఇటీవల ఫాస్కినో స్కూటర్‌ను విడుదల చేసింది. నేటి భారతదేశ జనాభాలో 50 శాతం యువతే ఉన్నారు. వారంతా ఫ్యాషన్‌గా ఒక అడుగు ముందుకు వేయాలని కోరుకుంటున్నారు.
ఎకనామికల్ మరియు ప్రాక్టికల్ ఇండియన్ ఫ్యామిలి మోటార్ సైకిల్‌గా యమహా యొక్క 125సీసీ సాలుటో తయారుచేయబడింది. ఇది కొత్తగా 125సీసీలో లైటెస్ట్ వెహికల్‌గా అభివృద్ధి చేయబడింది.
Also Read : మరిన్ని ఆసక్తికర విషయాలు


Click it and Unblock the Notifications








