ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న యమహా ఎమ్‌టి-320
యమహా ఫాస్కినో అనే ప్రీమియం స్కూటర్‌ను ఇటీవల భారత మార్కెట్లోకి విడుదల చేసింది. భవిష్యత్తులో మరిన్ని మోడళ్లను భారత్ కోసం విడుదల చేయాలని ఉంది.
ఈ జపనీస్ తయారీ సంస్థ తన వైజడ్ఎఫ్-ఆర్15 మోడల్‌తో విజయానికి బాటలు వేసుకుంది. అప్పటి నుంచి తన మోడళ్లను కాస్మొటిక్ మార్పులతో అభివృద్ధి చేస్తోంది.

రానున్న 2016 ఆటో ఎక్స్‌పోలో యమహా తన సరి కొత్త స్ట్రీట్ మోటార్ సైకిల్‌ను విడుదలచేయనుంది. దానికి ఎమ్‌టి-320 అని పేరు పెట్టింది. ఇది యమహా వైజడ్ఎఫ్-ఆర్3 మోటార్ సైకిల్ నుండి అభివృద్ధి చేయబడింది.
స్పెసిఫికేషన్స్ :
ఇంజన్ : 321సీసీ ఇన్-లైన్,2-సిలిండర్,లిక్విడ్ కూల్డ్.
హార్స్‌పవర్ : 41.40.
టార్క్ : 26.9 ఎన్ఎమ్.
గేర్‌బాక్స్ : 6-స్పీడ్, కాన్స్‌టాన్ట్ మెష్.

డిజైన్ పరంగా ఎమ్‌టి-320, ఎమ్‌టి రేంజ్ మోటార్ సైకిల్ మాదిరి మరియు ఇటీవల ఇండోనేషియాలో విడుదల చేసిన ఎమ్‌టి-25 మాదిరి ఉంది. కొన్ని కాంపొనెంట్స్ వైజడ్ఎఫ్-ఆర్3 మోటార్ సైకిల్‌లో ఉన్న విధంగా తయారుచేయబడింది.
యమహా తన మరిన్ని మోడళ్లను భారత్‌కు తీసుకువచ్చే ఆలోచనలో ఉంది. వైజడ్ఎఫ్-ఆర్3ను ఆగష్టు 2015లో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
Also Read: మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు


Click it and Unblock the Notifications








