పొట్ట మీద 100 రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను పోనిచ్చుకున్న తెలుగు కుర్రోడు
సాహసం ఏదైనా సరే గిన్నిస్ బుక్ రికార్డ్ దక్కాలనేది కొంత మంది కోరిక. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో విభిన్నంగా ఉండే మార్గాన్ని ఎంచుకుని అందులో మానవ శక్తి సామర్థ్యాలకు మించిన సాహసాలు చేసి ప్రపంచ గిన్నిస్ రికార్డులను నెల కొల్పుతుంటారు. అందులో మన రాజమహేంద్రవరానికి చెందిన చెందిన ఉజ్వల్ కూడా ఒకడు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో తన కంటూ ఓ స్థానం సాధించుకోవాలని ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఏకంగా 100 రాయల్ ఎన్పీల్డ్ బుల్లెట్ బైకులను తన పొట్ట మీద నుండి నడిపించుకుని ఔరా అనిపించాడు.

రాజమహేంద్రవరానికి చెందిన కొమ్మ ఉజ్వల్ ఇప్పటికే కరాటే, తైక్వాండో మరియు కింగ్‌బాక్సింగ్‌లలో మంచి ప్రావీణ్యం సాధించాడు.

తన అసాధారణ బలపరాక్రమమును ప్రదర్శించేందుకు ఉజ్వల్ తీసుకున్న నిర్ణయానికి నగర వాసులు, యువకులు, ప్రముఖులు మరియు మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై తన ఫీట్ పూర్తయ్యేంత వరకు ఉత్సాహపరిచారు.

ఇంతకు మునుపు ఉజ్వల్ ఇలాంటి ప్రదర్శనను హైదరాబాద్‌లో ఇచ్చాడు అప్పుడు ప్రముఖ సినీ హీరో మహేష్ చేతులు మీదుగా బహుమానం అందుకున్నాడు.

ప్రస్తుతం జాతీయ స్థాయిలో కరేట, బాక్సింగ్ మరియు తైక్వాండోలలో బగారు పతకాలను కూడా సాధించాడు. అయితే క్రితం రోజు (29/08/2016)న జరిగిన ఫీట్‌ను మూడు కెమరాలతో చిత్రీకరించి గిన్నిస్ బుక్ ప్రతినిధులకు పంపారు.

హ్యాట్సాఫ్ టు ఇండియన్ ఆర్మీ: చైనాకు ముప్పు తిప్పలు పెడుతున్న భారతీయ సైన్యం
బైకుల సామ్రాజ్యాన్ని కూల్చేస్తున్న స్కూటర్లు అందుకు నిదర్శనం


Click it and Unblock the Notifications








