లీకైన 2017 బజాజ్ పల్సర్ 180 చిత్రాలు: నూతనంగా సంతరించుకున్న మార్పులేంటి ?
విడుదలకు ముందే 2017 బజాజ్ పల్సర్ 180 ఫోటోలు పూర్తిగా రివీల్ అయ్యాయి. మునుపటి మోడల్‌తో పోల్చుకుంటే ఈ మోటార్ సైకిల్‌లో డిజైన్ పరంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
2017 బజాజ్ పల్సర్ 220ఎఫ్ తర్వాత బజాజ్ డీలర్ల వద్ద 2017 పల్సర్ 180 కనిపించింది. ఎన్నో మార్పులు సంతరించుకున్న ఈ బైకు విడుదల కంటే ముందుగా పూర్తిగా రివీల్ అయ్యింది.

ఫోటోలను గమనించిన తరువాత 2017 బజాజ్ పల్సర్ 180 డిజైన్ పరంగా మార్పులు జరిగినట్లు గుర్తించలేము. మునుపటి మోడల్‌తో పోల్చితే ఈ 2017 వేరియంట్‌లో స్వల్ప మార్పులు మార్పులు చోటు చేసుకున్నాయి.

2017 పల్సర్ 180 అప్‌డేటెడ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌లో మునుపటిలా ఆరేంజ్ రంగులో కాకుండా కాస్త నీలం రంగులో తెరను గమనించవచ్చు. మరియు హ్యాండిల్ బార్స్ మీద నల్లటి క్లిప్పులు కలవు.

కుదుపులు రైడర్ వరకు చేరకుండా మంచి కుషనింగ్‌తో డిజైన్ చేశారు. మునుపటి పల్సర్ 180 తో పోల్చుకుంటే ఇందులోని సీటు చాలా మృదువుగా ఉంది.

బాగా గుర్తించదగిన వాటిలో వెనుక వైపున చక్రం డిస్క్ బ్రేక్ కలిగి ఉండటం. ఈ 2017 పల్సర్ 180 మోడల్ వెనుక వైపు డిస్క్ బ్రేక్‌ను కలిగి ఉండటం ద్వారా దీని బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగుపడటం ఖాయం.

2017 బజాజ్ పల్సర్ ఇంజన్ యొక్క వివరాలు బహిర్గతం అవలేదు. అయితే ఈ ఇంజన్ బిఎస్ IV ఉద్గార నియమాలను పాటించనుంది. అంటే ప్రస్తుతం ఉన్న మోడల్‌లోని ఇంజన్‌తో పోల్చుకుంటే ఈ నూతన పల్సర్ 180లోని ఇంజన్ మరింత శక్తింవంతంగా ఉండనుంది.

ఇంజన్‌లో చోటు చేసుకున్న స్వాగతించదగిన మార్పుల ద్వారా బైకు యొక్క పనితీరు పెరిగే అవకాశం ఉంది.

సరికొత్త 2017 బజాజ్ పల్సర్ 180 లో 178.6సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. ఇది 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానంతో రానుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బజాజ్ పల్సర్ 180 బైకు సుమారుగా 17.02బిహెచ్‌పి పవర్ మరియు 14.22ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అయితే నూతన పల్సర్ లోని ఇంజన్ దీని కంటే గరిష్ట పవర్ మరియు టార్క్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

- ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో విడుదలవుతున్న కార్లు, వాటి వివరాలు
- ISIS దాడుల్లో బుల్లెట్ల దాడిని తిప్పికొట్టిన 1990 కాలం నాటి BMW


Click it and Unblock the Notifications








