2017 బజాజ్ పల్సర్ విడుదల తేదీ ఖరారు
బజాజ్ ఆటో ఇండియా దేశీయ మరియు అంతర్జాతీ మార్కెట్లోకి తమ కొత్త తరం పల్సర్ 200ఎన్ఎస్ బైకును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అమ్మకాలను పుంజుకునేందుకు 2017 మోడల్‌గా సరికొత్త పల్సర్ 200ఎన్ఎస్ ను అభివృద్ది చేస్తోంది.
గతంలో దేశీయంగా పల్సర్ 200ఎన్ఎస్ అమ్మకాలు క్షీణించడం కారణంగా దీనిని మార్కెట్ నుండి తొలగించింది.

బజాజ్ ఆటో ఇండియా ఇప్పుడు 2017 పల్సర్ 200ఎన్ఎస్ ను అభివృద్ది చేస్తోంది. దీనిని వచ్చే డిసెంబర్‌లో విడుదల చేయనుంది. మరియు వీటిని 2017 ప్రారంభం నుండి డెలివరీ ఇవ్వనున్నట్లు సమాచారం.

బజాజ్ తమ అమ్మకాలను పెంచుకోవడానికి తాజాగ పల్సర్ ఏఎస్200 మరియు ఏఎస్150 బైకులను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

అయితే ఏఎస్ శ్రేణి బైకులు పల్సర్ 200ఎన్ఎస్ కన్నా ఉత్తమ పనితీరును కనబరిచాయి. ఏఎల్ ఉత్పత్తులను పరిచయం చేయడానికి 200ఎన్ఎస్ మోడల్ మార్గం సుగమం చేసింది అని చెప్పవచ్చు.

బజాజ్ ఈ ఆటో ఈ 2017 పల్సర్ 200ఎన్ఎస్‌కు సంభందించిన సమాచారం అందివ్వలేదు. అయితే ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో రానుంది.

భద్రత పరంగా బజాజ్ ఆటో ఈ 2017 పల్సర్ 200ఎన్ఎస్ లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు ఆటోమేటిక్ హెడ్‌లైన్ ఆన్ (ఏఒహెచ్) సిస్టమ్‌లను పరిచయం చేయనుంది.

బజాజ్ సంస్థ గతంలో ప్రవేశ పెట్టిన పల్సర్ 200ఎన్ఎస్ లోని తప్పులను సవరిస్తూ, గరిష్ట నిర్మాణ విలువలతో ఈ 2017 పల్సర్ 200ఎన్ఎస్ ను తీసుకురానుంది. ఆకర్షణీయమైన రంగల్లో అందివ్వడానికి అధిక ప్రాధాన్యం చూపుతోంది.

- అడ్వెంచర్ బైకుల విడుదలకు సిద్దమైన యుఎమ్ మోటర్ సైకిల్
- అద్భుతం చేసిన అబ్దుల్ రెహమాన్...!!
- ఆగష్టు కార్ల అమ్మకాల్లో చోటు చేసుకున్న విచిత్రం


Click it and Unblock the Notifications








