2017 హోండా సిబిఆర్ 250ఆర్ఆర్ ఫోటోలు, వీడియో మరియు ఇతర వివరాలు
ప్రపంచ వ్యాప్తంగా బైకు రేసింగ్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బైకు హోండా సిబిఆర్ 250ఆర్ఆర్. ఈ వారంలోపు ఇది ఇండోనేషియా మార్కెట్లోకి విడుదల కానుంది. ఇది సుమారుగా 63 మిలియ్ ఇండోనేషియా రుపాయలతో (3.2 లక్షల) అందుబాటులోకి రానుంది.
హోండా సిబిఆర్ 250ఆర్ఆర్ గురించి విడుదలైన మరిన్ని వివరాలు క్రింది స్లైడర్లలో...

హోండా సంస్థ ఈ సిబిఆర్ 250ఆర్ఆర్‌ను రెండు విభిన్న వేరియంట్లలో అందిస్తోంది. అవి యాంటి లాక్ బ్రేకిగ్ సిస్టమ్ ఉన్న మరియు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేని రెండు వేరియంట్లు.

హోండా ఈ సిబిఆర్ 250ఆర్ఆర్‌లో సరికొత్త పరిజ్ఞానం థ్రోటిల్ బై వైర్ (TbW)సాంకేతికతను అందించింది.

లిటిల్ ఫైర్ బ్లేడ్‌గా అభివర్ణింపబడే ఇందులో 250సీసీ సామర్థ్యం ఉన్న స్ట్రైట్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించారు. అయితే దీని పనితీరుకు చెందిన వివరాలను మాత్రం రహస్యంగా ఉంచారు.

ప్రస్తుతం వెల్లడైన ఫోటోలను పరిశీలింస్తే దీని షార్ప్, ప్రోటోటైప్ మరియు అగ్రెసివ్ స్టైలింగ్ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఎల్‌ఇడి హెడ్ లైట్లు, ట్విన్ బ్యారెల్ ఎగ్జాస్ట్ మరియు డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ అన్ని కలిసి దీనిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాయి.

ఈ బైకులో ముందు మరియు వెనుక వైపున వైపున సింగిల్ పెటల్ రోటర్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

సస్పెన్షన్ పరంగా ఇందులో ముందు వైపున అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జ్వార్వర్‌ను అందించారు.

ప్రస్తుతం హోండా సంస్థ ఈ సిబిఆర్ 250ఆర్ఆర్‌ను ఇండోనేషియాలోని తమ తయారీ ప్లాంటులో ఉత్పత్తి చేయనుంది.

హోండా దీనిని జపనీస్ మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చిన తరువాత ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది.
హోండా సిబిఆర్ 250ఆర్ఆర్ వీడియో....

- 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక అనూహ్యంగా ఒడ్డుకు చేరిన వైనం


Click it and Unblock the Notifications