2017 హోండా యూనికార్న్ 160 విడుదల

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా విపణిలోకి 2017 యూనికార్న్ 160 బైకును విడుదల చేసింది. నూతన ఉద్గార నియమాలను పాటించే బిఎస్-IV ఇంజన్ అప్‌గ్రేడ్ ‌తో దీనిని విడుదల చేశారు.

By Anil

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ లైనప్‌లోని యూనికార్న్‌ 160 లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే అప్‌గ్రేడెడ్ ఇంజన్‌ను అందించింది. 2017 లో మార్కెట్లో విక్రయాలు జరిపే టూ వీలర్లలో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఇంజన్‌ అప్‌గ్రేడింగ్స్ నిర్వహించినట్లు హోండా తెలిపింది.

2017 హోండా యూనికార్న్ 160

2017 హెండా యూనికార్న్ 160 బైకులో ఉన్న మునుపటి ఇంజన్ స్థానంలో బిఎస్-IV ఇంజన్ మినహా మరే మార్పులు చోటు చేసుకులేదు. ఇది అవే మునుపటి రంగులైన మట్టీ బ్లూ పెయింట్ స్కీమ్, పియర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మట్టీ ఆక్సిస్ గ్రే, పియర్ల్ అమేజింగ్ వైట్ మరియు ఇంపీరియల్ రెడ్ మెటాలిక్ కలర్ ఆప్షన్‌లలో లభించును.

2017 హోండా యూనికార్న్ 160

ఇందులో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే అదే 162.71సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 13.82బిహెచ్‌‌పి పవర్ మరియు 13.92ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

2017 హోండా యూనికార్న్ 160

మునుపటి మోడల్ 14.5బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే ప్రస్తుత 2017 హోండా యూనికార్న్ లోని ఇంజన్ తక్కువ పవర్ ఉత్పత్తి చేయును. యూనికార్న్ 150 వేరియంట్ యొక్క పవర్ 13.14 బిహెచ్‌పి కు చాలా దగ్గరగా ఉంటుంది.

2017 హోండా యూనికార్న్ 160

2017 హోండా యూనికార్న్ 160 బైకులో ఆటో హెడ్‌ల్యాంప్ ఆన్ ఫీచర్ కూడా కలదు. మునుపటి యూనికార్న్ కన్నా ఇది 2ఎమ్ఎమ్ ఎక్కువ ఎత్తుగా ఉంది.

2017 హోండా యూనికార్న్ 160

ఇందులో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) కలదు. హోండా అధికారిక వెబ్‌సైట్ మీద బిఎస్-III స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 73,481 లు మరియు సిబిఎస్ వేరియంట్ ధర రూ. 75,934 లు ఎక్స్ షోరూమ్ ఢిల్లీగా ఉన్నాయి. అయితే ఈ బిఎస్-IV అప్‌గ్రేడెడ్ 2017 యూనికార్న్ 160 ధరలు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

2017 హోండా యూనికార్న్ 160
  • మారుతి సుజుకి ఇలాంటి నిర్ణయం తీసుకుందేంటి...!!
  • రతన్ టాటా గురించి ఆసక్తికరమైన విషయాలు...!!
  • 2016 ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో సంభవించిన 5 మార్పులు
  • .

    కొచ్చిన్ క్రిస్మస్ వేడుకల్లో టీవీఎస్ వీగో సంభరాలు

    టీవీఎస్ వీగో గురించి మరియు కొచ్చిన నగర విశేషాలతో పాటు క్రిస్మస్ వేడుకల అనుభవాలు....

More from DriveSpark

Article Published On: Thursday, December 29, 2016, 11:27 [IST]
English summary
2017 Honda Unicorn 160 Launched With BSIV Compliant Engine
Read more on: #హోండా #hyundai
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+