ఫీచర్లు, అప్‌డేట్స్‌తో యమహా 2017 వైజడ్ఎఫ్ ఆర్15
యమహా మోటార్స్ ఇండియా కొత్త రంగులు మరియు విభిన్నమైన గ్రాఫిక్స్‌తో అప్‌డేట్స్‌తో మాత్రమే తమ వైజడ్‌ఎఫ్-ఆ15 ను 2.0 వెర్షన్ గా 2011 లో మార్కట్లోకి పరిచయం చేశారు. తాజా నివేదికల ప్రకారం యమహా తమ వైజడ్ఎఫ్ ఆర్15 బైకును మరిన్ని స్పోర్టివ్ లక్షణాలతో 3.0 వెర్షన్‌గా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

మూడవ తరానికి చెందిన వైజడ్ఎఫ్-ఆర్15 బైకును ఎంట్రీ లెవల్ స్పోర్ట్ బైకు తరహాలో డిజైన్ చేయనున్నారు. అందుకోసం ముందు వైపున హెడ్ లైట్ మరియు ఫ్రంట్ ఫాసికాను స్పోర్టిల్ రూపంలో డిజైన్ చేస్తున్నారు.

పై పై సొగసులతో పాటు మంచి పనితీరు కనబరిచే విధంగా దీనిని ఇంజన్‌ను కూడా శక్తివంతంగా మారుస్తున్నారు. ఉద్గార నియమాలను పాటిస్తూ దీని ఇంజన్‌ను డెవలప్ చేస్తున్నారు. మరియు 2017 వైజడ్ఎఫ్-ఆర్15 చాలా వేగవంతమైనది కూడా.

భద్రత పరంగా ఈ వైజడ్ఎఫ్-ఆర్15 3.0 వెర్షన్‌లో యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్ ఆన్ సిస్టమ్ రానున్నాయి. అత్యంత ఖరీదైన ఉత్పత్తుల్లో కూడా ఇలాంటి ఫీచర్లు రావడం లేదు.

యమహా ఆర్15 బైకుల్లో రెండు రకాల సీటింగ్‌ను అందించారు, అందుకే ఈ అప్ కమింగ్ 2017 వైజడ్ఎఫ్-ఆర్15 లో రెండు రకాల సీట్ల(స్ల్పిట్ మరియు యూని స్టైల్) ను కూడా అందిస్తున్నారు.

ఫీచర్లు, అప్‌డేట్స్‌తో యమహా 2017 వైజడ్ఎఫ్ ఆర్15

- రికార్డ్ సృష్టించిన హోండా సిబి షైన్ ఎస్‌పి
- ఈ ఏడాదిలోపు భారీ లక్ష్యం మీద గురి పెట్టిన రెనో ఇండియా


Click it and Unblock the Notifications








