బజాజ్ వి ఎంతో ప్రత్యేకం అంటున్న అమీర్ ఖాన్

By Anil

భారీ విజయాల పరంపరతో ముందుగు దూసుకెళ్తున్న బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ బజాజ్ మోటార్ సైకిల్స్‌కు చెందిన వి బైకును ఎంచుకున్నాడు. ఇది తనకు ఎంతో ప్రత్యేకం అని తన మాటల్లో చెప్పుకొచ్చాడు. తనకు మాత్రమే కాదు దీనిని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరికి ఇది ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే భారత దేశ సైన్యానికి ఎన్నో సంవత్సరాల పాటు సేవలందించిన
INS విక్రాంత్‌ను కరిగించిన దాని ప్రాణాన్ని వీటికి రూపంగా అందించి తయారు చేశారు.

అమీర్ ఖాన్ బజాజ్ వి


బజాజ్ ఆటో సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ అయిన రాజీవ్ బజాజ్ స్పెషల్ ఎడిషన్ బజాజ్ వి మోటార్ సైకిల్‌ను స్వయంగా అమీర్ ఖాన్‌కు డెలివరీ ఇచ్చారు. ట్యాంకు మీద అమీర్ ఖాన్‌ పేరులోని మొదటి అక్షరం అయిన A ను ప్రత్యేకంగా ప్రింట్ చేసారు. అలాగే వెనుక వైపున ఉన్న సీటు చివరలో Chotelal అనే విధంగా 3డీ ఆకారపు గుర్తును అందించారు.

అమీర్ ఖాన్ బజాజ్ వి

బజాజ్ మోటార్ సైకిల్స్ ఈ వి మోటార్ సైకిల్‌ను ఫిబ్రవరి ప్రారంభంలో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేశారు. ఇండియన్ నేవీ మూలకు తరలించిన ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సేకరించి దాని పేరుకు ప్రతీకగా వి అనే నామకరణంతో ఈ బైకు పేరు పెట్టారు. వి బైకులో ఉన్న ఇంధన ట్యాంకును ఆ యుద్ద నౌక నుండి సేకరించిన మెటీరియల్‌తో రూపొందించారు.
అమీర్ ఖాన్ బజాజ్ వి

ఇంజన్ వివరాలు:

బజాజా ఆటో ఈ వి మోటార్ సైకిల్‌లో 149.5సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇది సుమారుగా 11.80 బిహెచ్‌పి పవర్ మరియు 13 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అందుకోసం ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు.

  • ప్రారంభ ధర : రూ. 66,614 ఎక్స్ షోరూమ్ (ముంబాయ్)
  • మైలేజ్ : 60 నుండి 70 కిలోమీటర్లు/లీటర్ (నడిపే విధాన్ని బట్టి మారవచ్చు).

More from DriveSpark

Article Published On: Wednesday, May 4, 2016, 11:28 [IST]
English summary
Aamir Khan Takes Delivery Of Special Bajaj V Motorcycle
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+