ఆప్రిలియా ఎస్‌ఆర్‌-150 పూర్తి స్థాయిలో సిద్దం: ఇంజన్ మరియు ఇతర సాంకేతిక వివరాలు

By Anil

ఆప్రిలియా ఎస్ఆర్-150 స్కూటర్ దేశీయ ఆటోమొబైల్ వార్తల్లో తరచూ వినడుతూనే ఉంది. విడుదలకు ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఆర్-150 స్కూటర్‌ను ఆప్రిలియా సంస్థ అతి త్వరలో దీనిని దేశీయంగా విడుదల చేయనుంది. ఆప్రిలియా వారి అత్యంత సరసమైన స్కూటర్ గురించి పూర్తి వివరాలు క్రింది కథనంలో...

అప్రిలియా ఎస్ఆర్-150

ఆప్రిలియా సంస్థ తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో ఈ ఎస్‌ఆర్-150 స్కూటర్ అత్యంత సరసమైనది. దీని ధర రూ. 65,000 లు ఎక్స్‌ షోరూమ్‌ (పూనే)గా ఉండనుంది.

అప్రిలియా ఎస్ఆర్-150

ఆప్రిలియా ఈ ఎస్ఆర్-150 స్కూటర్‌ను ఆగష్టు 15, 2016 న దేశ వ్యాప్తంగా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది.

అప్రిలియా ఎస్ఆర్-150

ఫోటోలలో ఉన్న ఎస్ఆర్-150 స్కూటర్‌ను గమనిస్తే దేశీయం స్కూటర్ సెగ్మెంట్లో మరే ఇతర స్కూటర్ ఈ తరహాలో ఉండనట్లు కనబడుతుంది.

అప్రిలియా ఎస్ఆర్-150

ఎస్ఆర్-150 స్కూటర్‌లో వెస్పా 150 లో వినియోగించిన ఇంజన్‌ను ఉపయోగిస్తున్నారు.

పవర్ మరియు టార్క్

పవర్ మరియు టార్క్

ఇందులోని 154.4సీసీ సామర్థ్యం ఉన్న సింగిల్ సిలిండర్ ఇంజన్ సుమారుగా 7,000ఆర్‌పిఎమ్ వద్ద 11.3బిహెచ్‌పి పవర్ మరియు 5,500ఆర్‌పిఎమ్ వద్ద 11.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

అప్రిలియా ఎస్ఆర్-150

సస్పెన్షన్ పరంగా ఇందులో ముందు వైపున హైడ్రాలిత్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్‌ను అందించారు.

అప్రిలియా ఎస్ఆర్-150

ఎస్ఆర్-150 స్కూటర్‌లో ముందు వైపున 220ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకును కల్పించారు.

అప్రిలియా ఎస్ఆర్-150

ముందు వైపు 120/70-14 అదే విధంగా 120/70-14 ట్యూబ్ లెస్ టైర్లను అందించారు.

అప్రిలియా ఎస్ఆర్-150

ఇందులోని ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ మొత్తాన్ని కంటిన్యూయస్లీ వేరిబుల్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి అందుతుంది.

అప్రిలియా ఎస్ఆర్-150

పియాజియా షోరూమ్‌ల ద్వారా ఆప్రిలియా వారి ఎస్ఆర్-150 స్కూటర్లు అందుబాటులోకి రానున్నాయి.

అప్రిలియా ఎస్ఆర్-150

ఇప్పటికే రూ. 5,000 లతో ఎస్ఆర్-150 ల బుకింగ్‌లను పియాజియో వారు ఆహ్వానించారు.

అప్రిలియా ఎస్ఆర్-150

బుకింగ్స్ చేసుకున్న తరువాత సుమారుగా 45 నుండి 60 రోజుల వరకు వెయిటింగ్ పీరియడ్‌ను ప్రకటించనున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో డెలివరీ ఇవ్వనున్నారు.

అప్రిలియా ఎస్ఆర్-150

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న 150సీసీ స్కూటర్లు ఏవి కూడా దీనికి పోటీగా లేవు. అయితే పియాజియో షోరోమ్‌లో ఉండే వెస్పా ఉత్పత్తులే దీనికి పోటీగా ఉండనున్నాయి.

అప్రిలియా ఎస్ఆర్-150

  • ప్రపంచంలో అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఎఫ్-35 గురించి పూర్తి వివరాలు

More from DriveSpark

Article Published On: Wednesday, August 3, 2016, 14:38 [IST]
English summary
Aprilia SR 150 Engine Specifications Revealed Ahead Of Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+