65,000 రుపాయలతో విడుదల కానున్న ఆప్రిలియా ఎస్ఆర్150
ఇండియన్ టూ వీలర్ల సెగ్మెంట్లోకి ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న ఆప్రిలియా ద్వి చక్రవాహనాల తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి తమ ఎస్ఆర్ 150 స్కూటర్‌ను విడుదల చేస్తున్నట్లు సమచారం. దీనిని 65,000 రుపాయల ఆకర్షణీయమైన ధరతో ఆగష్టు 2016 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇటాలియన్ ఆధారిత సంస్థ ఆప్రిలియా ఇండియన్ వినియోగదారులకు తమ ఉత్పత్తులను పియాజియో గ్రూపు ద్వారా చేరువ చేయనుంది. ఆప్రిలియా ఎస్ఆర్150 స్కూటర్ గురించి మరిన్ని క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

దేశీయ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్న ఆప్రిలియా ఎస్‌ఆర్150 స్కూటర్‌లో 150సీసీ సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అందిస్తున్నారు.

ఇంజన్ పనితీరు అంచనా వేసే పవర్ మరియు టార్క్ వివరాలను ఆప్రిలియా సంస్థ వెల్లడించడానికి నిరాకరించింది. అతి త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో దీనిని సంభందించిన మరే ఇతర సాంకేతిక వివరాలను వెల్లడించలేదని తెలిసింది.

ఆప్రిలియా ఎస్‌ఆర్150 స్కూటర్‌లో 14 అంగుళాల ఐదు స్పోక్స్ గలే అల్లాయ్ చక్రాలు ఉన్నాయి. ముందు వైపున డిస్క్ బ్రేకును కల్పించారు.

ఇటాలియన్ ఆధారిత ద్విచక్రవాహన తయారీ సంస్థ ఆప్రిలియా తమ ఉత్పత్తులను పియాజియో ఇండియా యొక్క మహారాష్ట్రలోని బరమతి ప్లాంటు నుండి తయారు చేయనున్నారు.

అత్యంత తక్కువ ధరతో తమ ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడానికి అన్ని ఉత్పత్తులను మరియు వాటికి కావాల్సిన అన్ని విడి పరికరాలను దేశయంగానే తయారుచేయనున్నట్లు ఆప్రిలియా తెలిపింది.

డిజైన్ మరియు ఆధునిత స్టైష్ పరంగా ఆప్రిలియా తమ స్కూటర్‌ను స్పోర్టివ్ ఫిలాసఫితో డిజైన్ చేసింది. దీనికి ఉత్తమ రైడింగ్ మరియు హ్యాండ్లింగ్ లక్షణాలను కూడా కల్పించింది.

ఇండియన్ మార్కెట్లోకి దీనికి ఉన్న మిగతా ఇతర పోటీదారులతో పోల్చుకుంటే దీనిని అంశాల పరంగా ఎంతో నాణ్యత ప్రమాణాలతో తయారు చేశారు.

ఆప్రిలియా సంస్థకు మోటోజిపి మరియు డబ్ల్యూఎస్‌బికె వంటి వాటికి పోటీగా ఉత్పత్తులను తయారు చేసిన అనుభవం కలదు.


Click it and Unblock the Notifications








