జూలై 2016 లో 3,29,833 యూనిట్లు డెలివరీ ఇచ్చిన బజాజ్
బజాజ్ ఆటో గడిచిన జూలై 2016 లో సుమారుగా 3,29,883 యూనిట్ల బైకులను డెలివరీ ఇచ్చింది. దేశీయ మరియు అంతర్జాతీయ అమ్మకాలు మొత్తం కలిపి ఈ సంఖ్యను నమోదు చేసింది. ఇండియన్ ఆధారిత సంస్థ గత జూలైలో లాభ-నష్టాలు లేకుండా నిలకడగా అమ్మకాలను సాధించింది.

జూలై 2015 లో జరిగిన అమ్మకాలలో 1,43,671 యూనిట్లు దేశీయంగా అమ్ముడుపోగా ఈ యేడు ఈ సంఖ్య 1,74,324 కు చేరుకుని 21 శాతం వృద్దిని నమోదు చేసుకుంది. అదే విదంగా గత ఏడాది జూలైలో 1,38,762 యూనిట్లు ఎగుమతి కాగా ఈ యేడు 20 శాతం క్షీణించి 1,11,203 యూనిట్లు ఎగుమతి అయ్యాయి.

వాణిజ్య వాహనాల అమ్మకాలు 8 శాతం పెరిగి జూలై 2016 లో 23,698 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 21,879 యూనిట్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జూలైలో 25,928 వాహనాలు ఎగుమతి కాగా ఈ యేడు జూలైలో 21 శాతం క్షీణించి 20,608 వాహనాలు మాత్రమే ఎగుమతి అయ్యాయి.
Also Read: వచ్చే ఏడాదిలోపు బజాజ్ విడుదల చేయనున్న కొత్త బైకులు
మొత్తం మీద బజాజ్ ఆటో జూలై 2016 అమ్మకాలలో 20 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.


Click it and Unblock the Notifications








