రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటిగా బజాజ్ నుండి కొత్త బైకులు
బజాజ్ ఆటో ఇండియా ఇండియన్ మార్కెట్లోకి కొన్ని కొత్త టూ వీలర్లను ఉత్పత్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తమ ప్రొడక్షన్ ఫోర్ట్‌ఫోలియోలిలో ఉత్పత్తి సామర్థ్యం పెంచుకునే ఏర్పాట్లు చేస్తోంది. అయితే రాయల్ ఎన్ఫీల్డ్ వారి బైకులకు పోటీగా బజాజ్ కొన్ని నూతన ఉత్పత్తులను తీసుకువచ్చే ధోరణిలో ఉంది. ఈ కథనానికి చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనంలో ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్‌కు ముఖ్యంగా పోటిని ఇవ్వనున్న సిఎస్400 బైకును బజాజ్ 2014 లో జరిగిన ఇండియన్ ఆటోఎక్స్‌పోలో ప్రదర్శించింది.

ప్రస్తుతం ఇండియన్ క్రూయిజ్ బైకుల సెగ్మెంట్లో రాయల్ ఎన్ఫీల్డ్ అగ్రగామిగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మరియు అంతర్జాతీయ మార్కెట్లో 350 సీసీ నుండి 500 సీసీ మధ్య సామర్థ్యం గల బైకులను అందుబాటులో ఉంచింది. దీనిని టార్గెట్ చేసుకుని బజాజ్ సిఎస్400 బైకును అభివృద్ది చేసింది.

ఈ ఏడాదిలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద యుఎమ్ మోటార్ సైకిల్స్ మూడు ఉత్పత్తులను విడుదల చేసింది. అయితే ఇవి క్రూయిజ్ బైకుల సెగ్మెంట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ మరియు బజాజ్ వారి అవెంజర్ బైకులకు పోటిగా వచ్చాయి.

బజాజ్ సిఎస్400 బైకును అధికారికంగా ఇంకా విడుదల చేయలేదు. దీని విడుదల వివరాలకు మరియు మరిన్ని ఆటోమొబైల్ కథనాల కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌తో కలిసి ఉండండి.

లేజర్ భీమ్ ద్వారా కొత్త ముప్పును ఎదుర్కొంటున్న పైలట్ మరియు విమాన ప్రయాణికులు
భారతదేశపు మొదటి సెమి హై స్పీడ్ రైలు గతిమాన్ ఎక్స్‌ప్రెస్

మహీంద్రా వారి 155సీసీ బైకు టెస్టింగ్: రహస్య ఫోటోలు మరియు సమాచారం.
లండన్ వీధుల్లో బంగారు కార్లలో ఊరేగింపుగా సౌదీ బిలియనీర్


Click it and Unblock the Notifications








