చేతక్ స్కూటర్‌ను మళ్లీ విడుదల చేయనున్న బజాజ్
బజాజ్ ఆటో మరో పెద్ద నిర్ణయం తీసుకుంది, స్కూటర్ల మార్కెట్ ను కదిలించే సామర్థ్యం ఉన్న తమ చేతక్ స్కూటర్ ను మళ్లీ మార్కెట్లోకి విడుదల చేయనుంది.
దేశీయ మార్కెట్లో ఉన్న ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంటోంది. మిగతా సంస్థలతో పోల్చితే బజాజ్ ఉత్పత్తులు చాలా ప్రత్యేకం. ఈ మధ్య కాలంలో బజాజ్ ఆటో టూ వీలర్ సెగ్మెంట్లో మంచి మార్కెట్ వాటాను సొంతం చేసుకుంటోంది. అంతే కాకుండా విభిన్నమైన ఉత్పత్పులను పరిచయం చేయడంలో తమకెవరూ సాటిలేరంటూ మరో సారి తమ చేతక్ స్కూటర్‌ని విడుదల చేయడానికి సిద్దమవుతోంది.

ఇండియన్ టూ వీలర్ మార్కెట్లో బజాజ్ ఉనికిని చాటిన ఉత్పత్తుల్లో అతి ముఖ్యమైనది చేతక్. పాత కాలంలో వీటి వినియోగం బాగా ఉండేది.

అయితే నూతన డిజైన్ పోకడలతో చేతక్ తరహా బైకులు అందకారంలోకి వెళ్లిపోయాయి. అయితే ఇప్పటికీ మంచి క్రేజ్ ఉన్న చేతక్ ను మళ్లీ రీలాంచ్ చేయడానికి సిద్దమవుతోంది బజాజ్.

టూ వీలర్ల మార్కెట్లో వాటాను పెంచుకునేందుకు వి15 ప్రీమియమ్ క్రూయిజర్, డొమైనర్400 స్పోర్ట్స్ క్రూయిజర్ వంటి ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దమవుతూనే చేతక్ ను తెరపైకి తీసుకొచ్చింది బజాజ్.

కమ్యూటర్, ప్రీమియమ్, స్పోర్ట్స్ బైకుల సెగ్మెంట్లో నిరూపించుకున్నప్పటికీ స్కూటర్ల సెగ్మెంట్లో బజాజ్ రాణించలేకపోయింది. అయితే చేతక్ ఎంట్రీతో తమకంటూ ప్రత్యేక ప్లాట్ ఫామ్ ను నిర్మించుకోనుంది.

పూనే ఆధారిత బజాజ్ 2017 నుండి తమ ప్రీమియమ్ స్కూటర్ చేతక్ రీ ఎంట్రీ ద్వారా స్కూటర్ల సెగ్మెంట్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి సిద్దమవుతోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బజాజ్ తమ చేతక్ స్కూటర్‌ను ప్రీమియమ్ ఉత్పత్తిగా అప్రిలియా ఎస్ఆర్150 మరియు పియాజియో వెస్పా మోడళ్లకు పోటీగా విడుదల చేయనున్నట్లు తెలిసింది.

మునుపటి చేతక్ స్కూటర్‌కు నెక్ట్స్ జెనరేషన్ ఉత్పత్తిగా సౌకర్యవంతమైన సీటు మరియు అత్యధిక స్టోరేజ్ సామర్థ్యంతో వచ్చే ఏడాది ప్రారంభనాటికి విడుదలయ్యే అవకాశం ఉంది.

సరికొత్త చేతక్ 125 నుండి 150 మధ్య సామర్థ్యం గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రీమియమ్ ఉత్పత్తిగా నిలవడం కోసం లైట్ వెయిట్ ఛాసిస్, ఆధునిక బ్రేకులు మరియు సస్పెన్షన్ సిస్టమ్‌తో రానుంది.

చేతక్ స్కూటర్‌ను మళ్లీ విడుదల చేయనున్న బజాజ్ కథనం పై మీ స్పందన తెలియజేయండి...

- ఇండియన్ మార్కెట్లోకి ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్
- బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు
- బజాజ్ నుండి మరో సంచలనాత్మక మోడల్


Click it and Unblock the Notifications








