రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

By Anil

పేటిఎమ్ ప్రస్తుతం ఆన్‌‌లైన్ అంగట్లో షాపింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ దీని గురించి బాగా తెలుసుంటుంది. ఇ-కామర్స్ వ్యాపారంలో గల దిగ్గజ సంస్థ పేటిఎమ్ ప్రముఖ బెస్ట్ మైలేజ్ బైకు బజాజ్ సిటి100 ఎటి ను కేవలం రూ. 27,668 లకే అందుబాటులో ఉంచింది.
Also Read: రెనో క్విడ్ ఆవిష్కరణ వెనుకున్న ఆసక్తికరమైన విషయాలు...!
దీనిని కొనుగోలు చేయడానికి సిద్దమయ్యారా...? అయితే క్రింద గల స్లైడర్లలో పేటిఎమ్‌కు సంభందించి అందుబాటులో ఉన్న ఆఫర్లను మరియు ఇతర వివరాలను తెలుసుకోండి ఎంచక్కా సిటి100 ను మీ ఇంటికి స్వాగతం పలకండి.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

దీనిని ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవడానికి BIKE5000 అనే ప్రోమో కోడ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీని ద్వారా బైకు అసలు ధర రూ. 32,668 నుండి 5,000 రుపాయలు క్యాష్‌బ్యాక్ ద్వారా 27,668 లకే మీ సొంతం చేసుకోవచ్చు.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

ఈ బైకుకు చెందిన బుకింగ్, పేమెంట్ మరియు డాక్యుమెంటేషన్ వంటి అన్ని పనులు పూర్తి చేసిన ఏడు రోజులకు మీ ఇంటికి దీనిని డెలివరీ చేస్తారు.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

అయితే మీరు గమనించాల్సింది. దీనిని ఒక సారి ఆర్డర్ ఇచ్చిన తరువాత క్యాన్సిల్ చేసుకోవడం, డబ్బులు వెనక్కి ఇవ్వడం వంటివి జరగవు అంతే కాకుండా బుకింగ్ చేసుకున్న ఏడురోజుల నుండి కాకుండా డాక్యుమెంటేషన్ పూర్తి చేసుకున్న ఏడు రోజుల తరువాత మాత్రమే డెలివరీ చేస్తారు. వినియోగదారులు ఇది గమనించుకోవాలి.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

ఇంతసేపు ఆఫర్లు గురించి మాట్లాడుకున్నాం. ఇక ఈ బైకు ప్రత్యేకతలు గురించి చూద్దాం రండి. బజాజ్ వారి సిటి 100 ఎటి బెస్ట్ మైలేజ్ బైకు లీటర్‌కు 89.5 కిలో మీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

సిటి 100లో 97.2సీసీ కెపాసిటి గల 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గాలితో చల్లబడుతుంది.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

ఈ ఇంజన్ 7,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 8.2 బిహెచ్‌పి పవర్ మరియు 4,500 ఆర్‌పిఎమ్ వేగం వద్ద 8.05 ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

సిటి 100 బైకులోని ఇంజన్‌కు 4-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు. తద్వారా ఇది గంటకు 90 కిలోమీటర్ల అత్యధిక వేగంతో పరుగులు పెడుతుంది.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

బజాజ్ సిటి 100 బైకులో 2.4 లీటర్ల రిజర్వ్ సామర్థ్యం మరియు 10.5 లీటర్ల సామర్థ్యం గల ఇంధన ట్యాంకు కలదు. మరియు ముందు, వెనుక వైపుల చక్రాలకు డ్రమ్ బ్రేకులు అందించారు.

రూ. 27,668 లకే బజాజ్ సిటి100 ఎటి బైకు

ఈ బజాజ్ సిటి బైకు ఎబోని బ్లాక్‌కు జోడిగా బ్లూ మరియు రెండ్ డీకాల్స్‌ను కల్పించారు. మరియు ఎలక్ట్రాన్ బ్లూ మరియు ఫ్లేమ్ రెడ్ రంగుల్లో కూడా లభించును. రెండు చక్రాలు కూడా అల్లాయ్ రిమ్‌లను కలగి ఉన్నాయి.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం.....
  • విమాన ప్రయాణంలో పైలట్లు మరియు ప్రయాణికులు చేసే 20 ఆసక్తికరమైన పనులు
  • ఆశ్చర్యం కలిగించే ధరతో విడుదలైన 150సీసీ బజాజ్ వి15 బైకు

More from DriveSpark

Article Published On: Tuesday, March 1, 2016, 11:58 [IST]
English summary
Bajaj CT100B At Rs. 27,668 On Paytm
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+