డిస్కవర్ 150 కు ముగింపు పలకనున్న బజాజ్
బజాజ్ టూ వీలర్స్ తమ డిస్కవర్ 150 ని మార్కెట్ నుండి తొలగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గత అక్టోబర్ 2016 లో దేశ వ్యాప్తంగా జీరో అమ్మకాలు నమోదు కావడమే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది.
బజాజ్ టూ వీలర్స్ తమ లైనప్‌లో ఉన్న పాత సరకును పూర్తిగా తొలగించి వాటి స్థానంలో కొత్త ఉత్పత్తులను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టం అవుతోంది. ఫలితాలివ్వని ఉత్పత్తులను తొలగించడానికి బజాజ్ సిద్దమవుతోంది.

గడిచిన అక్టోబర్ 2016 లో తమ డిస్కవర్ 150 మోడల్ దేశవ్యాప్తంగా ఒక్క యూనిట్ అమ్మకాలను కూడా జరపలేదనే నెపంతో మార్కెట్ నుండి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 150సీసీ ప్రీమియమ్ కమ్యూటర్ మోటార్ సైకిల్ ఆశించిన స్థాయిలో ఫలితాలివ్వలేదని డీలర్లు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

గతంలో బజాజ్ లోని డిస్కవర్ శ్రేణి అంటే అమ్మకాలకు నెలవుగా ఉండేది. దీనిని అదునుగా చేసుకుని డిస్కవర్ పేరుతో రెండు 150సీసీ ప్రీమియమ్ బైకులను ప్రవేశపెట్టింది. అవి, బజాజ్ డిస్కవర్ 150ఎఫ్ మరియు బజాజ్ డిస్కవర్ 150ఎస్.

అయితే ఒక శ్రేణిలో విపరీతమైన మోడళ్లను విడుదల చేయడం తప్పుగా భావిస్తున్నారు బజాజ్ అధికారులు. ఒకే శ్రేణి మీద అనేక మోడళ్లను అందుబాటులోకి తీసుకురావడమే అమ్మకాలకు పెద్ద ఎఫెక్ట్‌గా మారిందని చెబుతున్నారు.

ఈ రెండు వేరియంట్లలో కూడా 144.8సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 14.30బిహెచ్‌పి పవర్ మరియు 12.75ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ ఇందులోని ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అందించారు. డిటిఎస్-ఐ పరిజ్ఞానం గల ఇంజన్‌కు ఎగ్జాస్టెక్ అనే సాంకేతికతను జోడించారు.

బజాజ్ ఆటో డిసెంబర్ 15, 2016 న తమ ఫ్లాగ్ షిప్ మోడల్ డామినర్ 400 ను మార్కెట్లోకి విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.

- 2017 లో విడుదలకు సిద్దమైన బైకుల జాబితా మరియు వాటి పూర్తి వివరాల కోసం....
- ఆటో హెడ్ ల్యాంప్ ఫీచర్ తో విడుదలైన యమహా వైజడ్ఎఫ్-ఆర్15
- బజాజ్ డొమైనర్ 400 బైకు విడుదల తేదీ ఖరారు


Click it and Unblock the Notifications








