బజాజ్ డొమైనర్ 400 బైకు విడుదల తేదీ ఖరారు
బజాజ్ ఆటో తమ డొమైనర్ 400 మోటార్ సైకిల్ ఇండియా విడుదలను ఖాయం చేసింది. డిసెంబర్ 15, 2016 న ఇది మార్కెట్లోకి విడుదల కానుంది.
బజాజ్ నుండి విడుదలవ్వడానికి ఎంతగానో ఎదురు చూస్తున్న మరో బైక్ డొమైనర్ 400. బజాజ్ దీని దేశీయ విడుదలను ఎట్టకేలకు ఖాయం చేసింది. డిసెంబర్ 15, 2016 వ రోజున లాంఛనంగా విడుదల చేయడానికి బజాజ్ సన్నాహాలు చేస్తోంది.

బజాజ్ ఈ 400సీసీ సామర్థ్యం ఉన్న మోటార్ సైకిల్‌కు డొమైనర్ అనే పేరును కూడా అధికారికంగా ఖాయం చేసింది. బజాజ్ విడుదల చేయనున్న ఈ శక్తివంతమైన ఉత్పత్తి మహీంద్రా మోజో మరియు రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలో ఉన్న మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

ఈ డొమైనర్ 400 మోడల్ బైకును రెండేళ్ల క్రితం జరిగిన 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద సిఎస్ 400 అనే పేరుతో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది.

కాన్సెప్ట్ దశ నుండి ప్రొడక్షన్ దశకు చేరుకున్న డొమైనర్ 400 దాదాపు కాన్సెప్ట్ తరహాలోనే ఉండనుంది. అయితే ముందు వైపున ఉన్న అప్ సైడ్ ఫ్రంట్ ఫోర్క్స్ లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.

బజాజ్ ఈ డొమైనర్ 400 లో 373.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందిస్తోంది. దీనిని కెటిఎమ్ కుటుంబం నుండి సేకరించింది. కెటిఎమ్ 390 లో వినియోగించిన ఇదే ఇంజన్ బజాజ్ డొమైనర్‌లో అత్యుత్తమ పనితీరు కనబరిచే విధంగా ట్యూనింగ్ చేయబడింది.

డొమైనర్ 400 లో పరిచయం అయిన్న కెటిఎమ్ ఇంజన్ సుమారుగా 35 నుండి 40 బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును. ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడమైంది.

డొమైనర్ మీద అంచనాలను పెంచడానికి బజాజ్ వివిధ దశల్లో పలుమార్లు ఇండియన్ రహదారుల మీద పరీక్షలు చేసింది మరియు విడుదల తేదీ దగ్గరకు వచ్చిందనే సంకేతాలివ్వడానికి నవంబర్ 18, 2016 న తమ ఉత్పత్తి ప్లాంటులో మొదటి డొమైనర్ 400 ను విడుదల చేసింది.

ధరకు తగ్గ విలువలతో బైకులను విడుదల చేయడంలో బజాజ్‌ది ప్రత్యేకమైన స్థానం. సరసమైన ధరకు దీని విడుదలను ప్లాట్ చేస్తుందనడంలో అతిశయోక్తి లేదనాలి. దీనికి పోటీగా ఉన్న ఉత్పత్తులను ఎదుర్కొనేందుకు 1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

- 27 లక్షల కారుగా మారిన ఆరు లక్షల: కారు ఎలా ?
- ఐ10 ప్రొడక్షన్ కు చెక్ పెట్టిన హ్యుందాయ్
- విడుదలకు ముందే డీలర్ల వద్ద: బజాజ్ పల్సర్ 150


Click it and Unblock the Notifications








