మైక్రోసైట్ లైవ్ ద్వారా బజాజ్ డామినర్ 400 విడుదల వివరాలు
బజాజ్ ఆటో తమ డామినర్ 400 బైకు విడుదలను ఈ డిసెంబర్ 15, 2016 కి ఖాయం చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంభందించిన మరిన్ని వివరాలను డామినర్ 400 మైక్రోసైట్ ద్వారా అందుబాటులో ఉంచింది.
దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో తమ అప్ కమింగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను డిసెంబర్ 15, 2016 న విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. కాన్సెప్ట్ దశలో ఉన్నపుడు విభిన్న పేర్లతో నెట్టింట్లో చక్కర్లు కొట్టిన ఈ పర్ఫామెన్స్ బైకుకు "డామినర్ 400" అనే పేరును అధికారికంగా ఖరారు చేసింది.

అయితే బజాజ్ ఇప్పుడు ఈ డామినర్ 400 కు సంభందించిన వివరాలను బజాజ్ ప్రేమికులకు మరియు బజాజ్ ఉత్పత్తులను ఇష్టపడే ఔత్సాహికులకు తెలియజేయడానికి డామినర్ 400 పేరుతో మైక్రోసైట్ మరియు సోషల్ మీడియా పేజిలను ప్రారంభించింది. డామినర్ 400 సంభందించిన పూర్తి వివరాలను బజాజ్ ఇక్కడ తెలపనుంది.

ఈ బైకు కాన్సెప్ట్ దశలో ఉన్నపుడు మొట్టమొదటి సారిగా సిఎస్ 400 అనే పేరుతో 2014 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. తరువాత క్రటోస్ 400 అనే పేరుతో రానున్నట్లు కూడా ఆధారం లేని వార్త ఒకటి కొన్నాళ్ల పాటు తెగ సందడి చేసింది.

సాంకేతికంగా బజాజ్ డామినర్ 400 లో 375సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ రానుంది. దీనికి 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేస్తోంది.

బజాజ్ ఈ డామినర్ లోని ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ మరియు టార్క్ వివరాలను వెల్లడించలేదు, అయితే ఇది డ్యూయల్ ఛానెల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

బజాజ్ ఆటో అభిమానులకు మరియు ఔత్సాహికులకు ఈ డామినర్ 400 విడుదలకు ప్రత్యేక ఆహ్వానాలు పలుకుతోంది. లిమిటెడ్ ఎడిషన్ బ్రోచర్లను అందిస్తూ, విడుదల నాడు డామినర్ 400 ను టెస్ట్ డ్రైవ్ అవకాశం కూడా కల్పిస్తోంది బజాజ్.

**డిసెంబర్ 15, 2016 న విడుదల కానున్న బజాజ్ డామినర్ 400 విడుదల వివరాల కోసం డ్రైవ్‌స్పార్క్ తెలుగుతో కలిసి ఉండండి.

- మేక్ ఇన్ ఇండియా మరియు మేడిన్ ఇండియా అనే మంత్రాల్ని జపిస్తున్న మోడీ గారు విదేశీ కారునెందుకు వినియోగిస్తున్నాడు...?


Click it and Unblock the Notifications








