బజాజ్ డామినర్400 ఫీచర్లను తెలిపే టీజర్
బజాజ్ ఆటో తమ డామినర్ 400 బైకు విడుదలలో భాగంగా ఫీచర్లను తెలిపే టీజర్ ను మళ్లీ విడుదల చేసింది.
బజాజ్ ఆటో తమ ఫ్లాగ్ షిప్ మోడల్ బైకు డామినర్ 400 విడుదల ను ఇప్పటికే ఖాయం చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 15, 2016 న విడుదల కానున్న డామినర్ 400 ఫీచర్లకు సంభందించిన టీజర్ ను తాజాగ బజాజ్ విడుదల చేసింది.

బజాజ్ ఆటో తమ డామినర్ 400 కు సంభందించి విడుదల చేసిన టీజర్ ప్రకారం, సరికొత్త ఎల్ఇడి లైటింగ్ సిస్టమ్ గల హెడ్ ల్యాంప్‌ను ఆవిష్కరించింది. బజాజ్ తమ ఫేస్‌బుక్ పేజి ద్వారా డామినర్ 400 క్రూయిజర్ స్పోర్ట్స్ బైకు ఎల్ఇడి లైట్ ఫీచర్‌ను విడుదల చేసింది.

బజాజ్ ఆటో "ది డార్క్‌నెస్ బిఫోర్ ది బ్లేజింగ్ గ్లేర్ ఆఫ్ డామినర్ 400. ద బిగ్ బైక్ ఫర్ బిగ్ బాయ్స్ కమింగ్ ఆన్ 15 డిసెంబర్, 2016" (The darkness decimates before the blazing glare of Dominar 400. The Big Bike for Big Boys is coming on 15th Dec 2016) అనే క్యాప్షన్ పెట్టి టీజర్ ఫోటోను విడుదల చేసింది.

బజాజ్ ఆటో ఈ డామినర్ 400 ను 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించింది. ప్రదర్శన వేదిక మీద దీనికి ఔత్సాహికుల మంచి స్పందన లభించింది.

బజాజ్ ఆటో ఈ డామినర్ 400 బైకును ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ మరియు మహీంద్రా టూ వీలర్స్ వారి మోజో మిడ్-కెపాసిటి ఇంజన్ గల ఉత్పత్తులకు గట్టి పోటీనివ్వనుంది.

బజాజ్ ఆటో సాంకేతికంగా ఈ డామినర్ 400 బైకులో 373.2సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందించింది. దీనిని కెటిఎమ్ ఫ్యామిలీ నుండి సేకరించింది. దీని పనితీరు దాదాపుగా కెటిఎమ్ డ్యూక్ 390 ని పోలి ఉంటుంది.

పనితీరుకు సంభందించిన వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడికాకపోయినప్పటికీ ఇది సుమారుగా 30 నుండి 40 బిహెచ్‌పి ల వరకు పవర్ ఉత్పత్తి చేస్తుంది. మరియు ఇందులోని శక్తివంతమైన ట్రిపుల్ స్పార్క్ ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయబడింది.

బజాజ్ ఆటో ప్రొడక్షన్ ప్లాంటు నుండి తమ డామినర్ 400 మొదటి బైకును నవంబర్ 18, 2016 న ఉత్పత్తి చేసింది. మరియు ఇది సుమారుగా 1.5 లక్షల రుపాయల ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదలయ్యే సూచనలున్నాయి.

బజాజ్ దీనిని పూర్తి స్థాయిలో విడుదల చేస్తే బజాజ్ లైనప్ లో అత్యంత శక్తివంతమైన మరియు టాప్ ఎండ్ ఉత్పత్తిగా నిలవనుంది.

కోట్ల రూపాయల సిరి సంపదలు ఉన్నప్పటికీ అత్యంత సాదాసీదా వ్యక్తిగా జీవించడం మన సూపర్ స్టార్ రజనీకాంత్‌కే చెల్లుతుంది, రజనీ కాంత్ గారి పుట్టిన రోజు సందర్భంగా - రజనీ కార్ కలెక్షన్

- మారుతి స్విఫ్ట్ డిజైర్ కు గట్టి పోటీని సిద్దం చేసిన షెవర్లే
- మహీంద్రా నుండి మరో కాంపాక్ట్ SUV
- ఇండియన్ రైల్వేలోకి మరో అరుదైన సర్వీసు


Click it and Unblock the Notifications








