ధరల పెంపు బాటలో బజాజ్

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లో ఉన్న తమ అన్ని బైకుల్లో దాదాపుగా బిఎస్-IV ఉద్గార నియమాలు పాటించే ఇంజన్‍‌లతో మార్పులు చేసింది. ఫలితంగా ధరలను కూడా పెంచింది.

By Anil

బజాజ్ ఆటో దేశీయ ద్విచక్ర వాహన విపణిలో ఉన్న అన్ని మోడళ్లలో కూడా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అందించింది. తద్వారా పెట్టుబడి వ్యయం కూడా పెరింగిందని బజాజ్ తమ ఉత్పత్తుల మీద రూ. 1,500 ల వరకు ధరలు పెంచినట్లు ప్రకటించింది.

ధరల పెంపు బాటలో బజాజ్

వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి దేశీయంగా ఉన్న అన్ని ద్విచక్ర వాహన తయారీ సంస్థలు తమ ఉత్పత్తుల్లో బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అందించాల్సి ఉంది. తరువాత లెవల్ ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌లను అందించడంలో బజాజ్ మొదటి కావాలనే ఉద్దేశంతో నూతన ఫోర్ట్‌ఫోలియోను పరిచయం చేసినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ ప్రెసిడెంట్ ఎరిక్ వాస్ తెలిపాడు.

ధరల పెంపు బాటలో బజాజ్

ప్రస్తుతం పల్సర్ శ్రేణి బైకుల్లో మరియు నూతనంగా అందుబాటులోకి వచ్చిన మోడళ్లలో బిఎస్‌-IV ఇంజన్‌లను పరిచయం చేశామని. వచ్చే జనవరి తొలి సగ భాగానికి మిగతా ఉత్పత్తుల్లో కూడా బిఎస్-IV ఇంజన్‌లను ప్రవేశపెడతామని ఆయన వెల్లడించాడు.

ధరల పెంపు బాటలో బజాజ్

ఇంజన్ మరియు మోడళ్లను బట్టి తమ బైకుల మీద రూ. 700 నుండి రూ. 1500 ల వరకు ధరలను పెంచుతున్నట్లు స్పష్టం చేశారు. ధరల సవరణల అనంతరం నూతన ధరలు వచ్చే ఏడాది జనవరి 1 నుండి అమల్లోకి రానున్నాయి. అంత వరకు పాత ధరలతో బజాజ్ బైకులను కొనుగోలు చేయవచ్చు.

ధరల పెంపు బాటలో బజాజ్

ఎరిక్ వాస్ ధరల పెంపు గురించి వివరణ ఇస్తూ, పెట్టుబడి వ్యయాలు పెరగడం, ముడి సరుకుల ధరలు పెరుగుదల మరియు బిఎస్-IV ఇంజన్ పరిచయం చేయడం వంటి అంశాల పరంగా ధరల పెంపు తప్పనిసరి అయ్యిందని చెప్పుకొచ్చాడు.

ధరల పెంపు బాటలో బజాజ్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న ద్విచక్ర వాహన తయారీ సంస్థలు బిఎస్-III ఉద్గార నియమాల ఆధారంగా తమ ఉత్పత్తులను విడుదల చేయాల్సి ఉండేది. అయితే తక్కువ ఉద్గారాలను విడుదల చేసే విధంగా ఇంజన్ డిజైన్ ఉండాలి మరియు ఇంజన్ విడుదల చేసే ఉద్గారాలు కూడా బిఎస్ ఉద్గార నియమావళిలో పొందుపరిచిన వాటికి సమానంగా లేదా దానికంటే తక్కువగా ఉండాలి. ఇలాంటి ఇంజన్‌లకు మాత్రమే అనుమతులు ఉంటాయి.

ధరల పెంపు బాటలో బజాజ్

అయితే కాలుష్యాన్ని నివారించేందుకు ఇప్పుడు కొత్తగా బిఎస్-IV ఉద్గార నియమావళి అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం అన్ని ద్విచక్ర వాహన ఇంజన్‌లు కూడా ఇందులో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా ఉద్గారాలను విడుదుల చేయాలి అంత కన్నా ఎక్కువ ఉద్గారాలను విడుదల చేస్తే వాటికి అనుమతులు రద్దు చేయడం జరుగుతుంది.

ధరల పెంపు బాటలో బజాజ్

ఎమిషన్ టెస్టింగ్ మిషన్ ద్వారా ఉద్గారాల (కార్బన్, నైట్రోజన్, కార్బన్ మోనాక్సైడ్) శాతాన్ని పరిశీలించవచ్చు. తద్వారా ఇంజన్ యొక్క ఉద్గార వివరాలు వెల్లడవుతాయి.

ధరల పెంపు బాటలో బజాజ్

ప్రస్తుతం దేశీయంగా హ్యుందాయ్ మోటార్స్, నిస్సాన్, రెనో, డాట్సన్, టయోటా, టాటా మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ మరియు ఇసుజు వంటి వాహన తయారీ సంస్థలు ఇప్పటికే తమ ఉత్పత్తుల మీద ధరల పెంపును ప్రకటించాయి. జనవరి 1, 2017 నుండి నూతన ధరలు అమల్లోకి రానున్నాయి.

ధరల పెంపు బాటలో బజాజ్

  • చాలా మందికి తెలియని మహీంద్రా వాహనాలు
  • పాత చింతకాయ పచ్చడిలా మళ్లీ అదే మోడల్
  • కొలియోస్, ఫ్లూయెన్స్ ల నిలిపివేత దిశగా రెనో

More from DriveSpark

Article Published On: Thursday, December 22, 2016, 10:37 [IST]
English summary
Bajaj Announces Price Increase Of Its Motorcycles
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+