ఈ నెలలో బజాజ్ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైకు విడుదల
బజాజ్ క్రటోస్ విఎస్400 ఈ మాసంలోనే విపణిలోకి విడుదల కానుంది. బజాజ్ ఇప్పటికే వీటిని డీలర్లకు పంపిణీ చేయడం ప్రారంభించింది.
బజాజ్ వారి క్రటోస్ విఎస్400 విడుదల కోసం భారతీయ ద్విచక్ర వాహన పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తోంది. బజాజ్ ఆటో తెలిపిన వివరాల మేరకు తమ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైక్ ఈ నెలలో (నవంబర్ 2016) మార్కెట్లోకి విడుదల కానుంది. బజాజ్ ఇప్పటికే వీటిని తగు మొతాదులో ఉత్పత్తి చేసి డీలర్లకు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

బజాజ్ పేరు మరో సారి మారుమ్రోగడానికి కారణమయ్యే క్రటోస్ విఎస్400 బైకును ఎట్టకేలకు ఈ ఏడాది ఇదే మాసంలో విడుదల చేయడానికి ఎర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

దేశ ఆర్థిక రాజధానికి ముంబాయ్ నగరం కేంద్రంగా బజాజ్ తమ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైకును విడుదల చేయనుంది.

ప్రస్తుతం వార్తా వేదికల్లో స్వైరవిహారం చేస్తున్న సమాచారం ప్రకారం బజాజ్ ఆటో ఇప్పటికే తమ క్రటోస్ విఎస్400 బైకులను డీలర్లకు పంపిణీ చేయడం ఆరంభించినట్లు తెలిసింది. నవంబర్ మధ్య భాగానికి పూర్తి స్థాయిలో డీలర్లకు డెలివరీ ఇవ్వనున్నట్లు తెలిసింది.

క్రటోస్ విఎస్400 బైకుల ఉత్పత్తి, డీలర్లకు సరఫరా వంటి అనేక ఇతర కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్న బజాజ్ దీని విడుదలకు చెందిన తేదీలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.

బజాజ్ ఆటో ఈ క్రటోస్ విఎస్400 బైకును మొదటి సారిగా 2014 ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. అప్పట్లో దీనిని పల్సర్ విఎస్400 పేరుతో ప్రదర్శించారు. ఇందులో విఎస్ అనగా వాంటేజ్ స్పోర్ట్ అని అర్థం.

కాన్సెప్ట్ దశలో బజాజ్ బ్రాండ్ పేరు క్రింద ఉన్నప్పటికీ ప్రొడక్షన్ మరియు విడుదల దశకు చేరుకున్న దీనిని ఇప్పుడు క్రటోస్ అనే సరికొత్త బ్రాండ్ పేరుతో మార్కెట్లోకి విడుదల చేయాలని బజాజ్ నిర్ణయించింది.

బజాజ్ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైకులో 373సీసీ సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్, ట్రిపుల్ స్పార్క్ డిటిఎస్-ఐ ఇంజన్ కలదు. కెటిఎమ్ డ్యూక్ 390 లోని అదే ఇంజన్‌ను ఈ క్రటోస్ విఎస్400 లో ఉపయోగించారు.

కెటిఎమ్ నుండి ఇంజన్‌ను సేకరించినప్పటికీ బజాజ్ తమదైన శైలిలో ఇంజన్‌లో మార్పులు చేసింది. తద్వారా విభిన్న ఇంజన్ శబ్దంతో పాటు గరిష్టంగా 35బిహెచ్‌పి వరకు పవర్ ఉత్పత్తి చేయును.

బజాజ్ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైకులోని ఇంజన్‌కు 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేసింది. అత్యుతమ పనితీరును కనబరిచేందుకు ఇందులో బజాజ్ స్లిప్పర్ క్లచ్‌ను పరిచయం చేసింది.

కాన్సెప్ట్ దశలో ఉన్న విఎస్400 కు ప్రొడక్షన్ రూపంలో ఉన్న క్రటోస్ విఎస్400 పోల్చితే స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో ఉన్న అప్ సైడ్ ఫ్రంట్ పోర్క్ స్థానంలో ఇప్పుడు టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చింది.

బజాజ్ ఈ క్రటోస్ విఎస్400 స్పోర్ట్స్ బైకును 1.5 నుండి 1.6 లక్షల ధరల శ్రేణిలో విడుదల చేసే అవకాశం ఉంది.

- విడుదల కంటే ముందుగా సుజుకి ఇగ్నిస్ డెలివరీ !!
- బంగారపు విమానాన్ని కలిగి ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్
- 300 టన్నుల బంగారు రైలు దక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా


Click it and Unblock the Notifications








