బజాజ్ ప్లాటినా కంఫర్‌టెక్ విడుదల: ప్రారంభ ధర రూ. 44,554 లు

By Anil

బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి కంఫర్‌టెక్ పేరుతో ప్లాటినా కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీనిని ముఖ్యంగా రైడ్ అండ్ కంఫర్ట్‌కు ప్రాధాన్యత కల్పిస్తూ రూపొందించారు.

బజాజ్ ప్లాటినా కంఫర్‌టెక్

ఈ సరికొత్త ప్లాటినాలో మునుపటి కన్నా కుదుపులు 20 శాతం తగ్గిపోయాయి అందుకోసం ఫ్రంట్ సస్పెన్షన్‌ను 28 శాతం పెంచారు. అదే విధంగా వెనుక వైపు సస్పెన్షన్‌ను 28 శాతం పెంచుతూ, వెనుక వైపున ఉన్న స్పస్పెన్‌లోని స్ప్రింగ్‌ను డబుల్ చేసారు.
బజాజ్ ప్లాటినా కంఫర్‌టెక్

సీటింగ్ సౌకర్యాన్ని పెంచడానికి స్ప్రింగ్ సాఫ్ట్ ను అందించారు. అంతే కాకుండా రబ్బర్ ఫుట్ పెడల్స్‌ను కూడా అందించారు. ఇది రైడింగ్ సమయాల్లో కాళ్లకు సౌకర్యాన్ని కలిగిస్తుంది.

సాంకేతికంగా ఇందులో 102సీసీ సామర్థ్యం గల డిటిఎస్-ఐ సింగల్ సిలిండర్ ఇంజన్‌ను అందించారు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 8.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. దీనికి 4-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు. ఏఆర్ఏఐ ప్రకారం ఇది లీటర్‌కు 104 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇవ్వగలదు.
Also Read: ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ సేఫ్టీ రికార్డ్: 30 ఇయర్స్‌లో జీరో డెత్
లభించే రంగుల విషయానికి వస్తే ఇది రెడ్, బ్లాక్ మరియు బ్లూ రంగుల్లో లభించును. కంఫర్‌టెక్ ప్లాటినా 100 అల్లాయ్ ఇఎస్ మరియు ప్లాటినా 100 అల్లాయ్ కెఎస్ అనే వేరియంట్లలో లభించును.

ధరలు

  • ప్లాటినా 100 అల్లాయ్ ఇఎస్ ధర రూ. 42,541 లు
  • ప్లాటినా 100 అల్లాయ్ కెఎస్ ధర రూ. 44,554 లు

రెండు ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
Also Read: ఇండియన్ ఆర్మీ వాహనాలపై నెంబర్‌ప్లేట్ల మీద ఉన్న పదాల అర్థం ఏమిటి ?
బజాజ్ సంస్థ దీనికి 5,000 కిలోమీటర్ల వరకు వివిధ దశలలో సర్వీసింగ్ మరియు ప్రతి 10,000 కిలోమీటర్లకు ఆయిల్ ఛేంజ్ ను అందిస్తున్నారు. బజాజ్ 65 శాతం మెయింటెనెన్స్ తగ్గించింది.

More from DriveSpark

Article Published On: Wednesday, August 10, 2016, 13:44 [IST]
English summary
Bajaj Platina ComforTec Launched In India For Rs. 44,554
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+