పల్సర్ శ్రేణిలో మూడు కొత్త బైకులను విడుదల చేసిన బజాజ్
బజాజ్ ఆటో తమ పల్సర్ శ్రేణి బైకులకు అప్‌డేట్స్ నిర్వహించింది 2017 మోడళ్లుగా మళ్లీ మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి నూతన ధరలను కూడా వెల్లడించింది. పూర్తి వివరాలను ఇవాళ్టి స్టోరీలో తెలుసుకుందాం రండి.
భారత దేశపు ప్రఖ్యాత ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఇండియన్ మార్కెట్లోకి తమ అప్ డేటెడ్ పల్సర్ 180, 150 మరియు 135ఎల్ఎస్ వంటి వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త పల్సర్ శ్రేణి బైకుల ప్రారంభ ధర రూ. 60, 178 లుగా ఉంది.

2017 బజాజ్ పల్సర్ శ్రేణి బైకుల ధరలు
- పల్సర్ 135ఎల్ఎస్ ధర రూ. 60, 178 లు
- పల్సర్ 150 ధర రూ. 73,513 లు
- పల్సర్ 180 ధర రూ. 79, 545 లు
అన్ని ధరలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నాయి.
- 17.5 గంటల పాటు నాన్ స్టాప్ గా ప్రయాణించే విమానం...
- మారుతి స్విఫ్ట్ డిజైర్ కు గట్టి పోటీని సిద్దం చేసిన షెవర్లే
- మారుతి నుండి శక్తివంతమైన హ్యాచ్ బ్యాక్ విడుదల ఖరారు

బజాజ్ ఆటో సాంకేతికంగా తమ మూడు వేరియంట్లు, 150 మోడల్ మినహాయించి బిఎస్-IV ఇంజన్‌లను కలిగి ఉన్నాయి. ఇందులోని పల్సర్ 135ఎల్ఎస్ మోడల్ లో 135సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 13.3బిహెచ్‌పి పవర్ మరియు 11.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

పల్సర్ 150 మోడల్ అదే పాత 149సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఇంజన్‌తో వచ్చింది. ఇది గరిష్టంగా 13.1బిహెచ్‌పి పవర్ మరియు 12.5ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును.

బజాజ్ ఆటో తమ పల్సర్ 180 మోడల్ లో అప్ డేటెడ్ బిఎస్-IV ఇంజన్‌ను అందించింది. ఇందులోని 180సీసీ సామర్థ్యం గల ఎయిర్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 17బిహెచ్‌పి పవర్ మరియు 14.22ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును. దీనికి 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం చేయడమైనది.

బజాజ్ పల్సర్ శ్రేణిలోని మూడు మోడళ్లకు నిర్వహించిన ఇంజన్ అప్ డేట్స్‌తో డిజైన్ పరంగా కూడా స్వల్ప సొబగులు చేర్చింది. అందులో డ్యూయల్ టోన్ బ్లూ మరియు వైట్ పెయింట్ జాబ్ కలదు మరియు బ్లూ బ్లాక్ లిట్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు.

బజాజ్ పల్సర్ 135 ఎల్ఎస్ బైకులో గతంలో ఉన్నటువంటి స్ల్పిట్ సీటు స్థానంలో సింగల్ పీస్ సీటును అందించింది.



Click it and Unblock the Notifications








