త్వరలో విడుదల కానున్న బజాజ్ 150 ఎన్ఎస్ టీజర్ విడుదల

బజాజ్ ఆటో అతి త్వరలో విడుదల చేయనున్న పల్సర్ 150ఎన్ఎస్ కు పరీక్షలు నిర్వహించింది. అయితే వీటిని పరీక్షించిన వీడియోను విడుదల చేసింది. సరికొత్త బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్ ఫోటో, వీడియో మరియు విడుదల వివరాలు

By Anil

బజాజ్ ఆటో తమ అప్ కమింగ్ 150ఎన్ఎస్ బైకు టీజర్‌ను విడుదల చేసింది. 200ఎన్ఎస్‌ బైకుకు చిన తోబుట్టువుగా పల్సర్ 150ఎన్ఎస్ 2017 నాటికి ఇండియన్ మార్కెట్లోకి విడుదల కానునున్న దీనిని బజాజ్ ఇప్పటికే ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు కూడా ప్రారంభించింది.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

బజాజ్ తెలిపిన సమాచారం మేరకు పల్సర్ 150 ఎన్ఎస్ మోడల్ ను థాయిలాండ్, టర్కీ, ఫిన్లాండ్, ఈక్విడార్, పెరు, మెక్సికో, కంబోడియా మరియు అమెరికా వంటి అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిసింది.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

కొత్త తరం బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్ ఇండియాలో విడుదలకు అమితాస్తకితో ఉంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బజాజ్ ఈ పల్సర్ 150ఎన్ఎస్‌ను 2017 ఏడాది ప్రారంభానికి దేశీయ విపణిలోకి విడుదల చేసే అవకాశం ఉంది.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

ప్రముఖ జిమ్నాస్టిక్స్ ఆధ్వర్యంలో బజాజ్ ఈ పల్సర్ 150ఎన్ఎస్ కు హ్యాండ్లింగ్ మరియు ధృఢత్వానికి చెందిన పరీక్షలు నిర్వహించిన వీడియోను టీజర్ రూపంలో విడుదల చేసింది. గతం పలుమార్లు ఈ మోడల్‌కు ఇండియన్ రోడ్ల మీద పరీక్షలు నిర్వహించారు.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

డిజైన్ విషయానికి వస్తే దీనికి పై స్థానంలో ఉన్న పల్సర్ 200ఎన్ఎస్ డిజైన్‌కు చాలా దగ్గరి పోలికలతో 150ఎన్ఎస్ మోడల్ డిజైన్ చేయబడింది. ఇందులో బాగా గుర్తించదగిన విషయం 150సీసీ సామర్థ్యం గల ఇంజన్ ఆప్షన్‌తో రావడం.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

బజాజ్ పల్సర్ 150 ఎన్ఎస్ బైకులో 149.5సీసీ సామర్థ్యం గల ట్విన్ స్పార్క్ నాలుగు వాల్వ్‌ల, గాలితో చల్లబడే ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 16.7బిహెచ్‌పి పవర్ మరియు 13ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

బజాజ్ ఈ పల్సర్ 150ఎన్ఎస్ కు స్పోర్టివ్ సొబగులు అద్దింది. డిజైన్ పరంగానే కాకుండా ఇంజన్ పరంగా కూడా అత్యుత్తమ పనితీరును కనబరిచేందుకు ట్యూనింగ్ చేయబడింది. ఈ శ్రేణిలో సిబిఆర్ 150 (18.2బిహెచ్‌పి పవర్) తరువాత ఇదే అత్యంత శక్తివంతమైనది.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

పల్సర్ 150ఎన్ఎస్ బజాజ్ యొక్క రెండవ తరపు నేక్డ్ మోటార్ సైకిల్. గతంలో అందుబాటులో ఉన్న 200ఎన్ఎస్ ను మార్కెట్ నుండి తొలగించింది. అయితే దీనిని మళ్లీ మార్కెట్లోకి రీలాంచ్ చేసే అవకాశం ఉందని ఆధారం లేని వార్తలొస్తున్నాయి.

బజాజ్ పల్సర్ 150ఎన్ఎస్

బజాజ్ ఆటో ఈ పల్సర్ 150ఎన్ఎస్ ను మార్కెట్లోకి విడుదల చేస్తే దీని ధర సుమారుగా రూ. 85,000 లు గా ఉండే అవకాశం ఉంది. మరియు ఇది సుజుకి జిక్సర్ మరియు హోండా సిబి హార్నెట్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

బజాజ్ ఆటో విడుదల చేసిన పల్సర్ 150ఎన్ఎస్ టీజర్ ను వీక్షించగలరు...

More from DriveSpark

Article Published On: Thursday, December 8, 2016, 18:46 [IST]
English summary
Bajaj Pulsar 150 NS Teased; To Be Launched In India In 2017
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+