పల్సర్ 200ఎన్ఎస్‌కు మళ్లీ జీవం పోసిన బజాజ్: గెట్ రెడీ ఇండియా

బజాజ్ వియత్నాంలో తమ పల్సర్ 200ఎన్ఎస్ ను నూతన శైలిలో మోడిఫై చేసింది. కవాసకి జడ్1000 ప్రేరణతో దీనిని మోడిఫై చేశారు. రూపంలోనే కాదు రైడింగ్‌లో కూడా కవాసకిని గుర్తుచేస్తుంది ఈ మోడల్.

By Anil

బజాజ్ ఆటో ఇండియా దేశీయ మార్కెట్లోకి 2012 లో తమ పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకును విడుదల చేసింది. అప్పటి నుండి అమ్మకాల్లో సునామీని సృష్టించింది. అయితే అందరినీ షాక్‌కు గురి చేస్తూ 2015 లో బజాజ్ ఈ 200ఎన్ఎస్‌ను మార్కెట్ నుండి తొలగించింది.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పల్సర్ 200ఎన్ఎస్ వియత్నాంలో గుర్తించినది. రూపం పరంగా చూస్తే ఇది పల్సర్ ఎన్ఎస్ ను పోలి ఉండకపోవచ్చు. అన్ని శరీర భాగాలు బజాజ్‌కు చెందినవే, అయితే దీనిని కవాసకి జడ్1000 మోటార్ సైకిల్ ప్రేరణతో మోడిఫై చేశారు.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

చూడటానికి అచ్చం కవాసకి జడ్1000 రూపంలో ఉండటమే కాదు, దీనిని రైడింగ్ చేస్తున్నపుడు కూడా కవాసకి జడ్1000 రైడింగ్ అనుభూతిని కలుగజేస్తుంది.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

అనూహ్యంగా ఇండియన్ మార్కెట్‌ నుండి తప్పుకున్న పల్సర్ 200ఎన్ఎస్ ఇప్పుడు ఈ రూపంలో పరిచయం కావడంతో పల్సర్ 200ఎన్ఎస్ ప్రేమికుల్లో కాస్త సందడి నెలకొందని చెప్పవచ్చు.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

సాంకేతిక అంశాల పరంగా గమనిస్తే ఇందులో కొత్తగా డిజైన్ చేయబడిన 350సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ పెట్రోల్ ఇంజన్ కలదు.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

ఈ పల్సర్ 200ఎన్ఎస్ లోని శక్తివంతమైన ఇంజన సుమారుగా 21బిహెచ్‌పి పవర్ మరియు 18.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును. అయితే మోఢిఫైడ్ పల్సర్ 200ఎన్ఎస్ యొక్క అవుట్ పుట్ వివరాలు వెల్లడి కాలేదు.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

సాంకేతిక అంశాలను మినహాయిస్తే డిజైన్ పరంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయనేది సులభంగా స్పష్టం అవుతోంది. ఈ 200ఎన్ఎస్ లో అధునాత ఎల్ఇడి హెడ్ లైట్లు మిక్కిలి ఆకర్షణీయంగా ఉన్నాయి.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

180 సెక్షన్ గల విశాలమైన వెనుక టైరు, బ్రెంబో సంస్థకు చెందిన బ్రేక్ కాలిపర్లు, ఆస్టియన్ రేసింగ్‌కు చెందిన ఎగ్జాస్ట్ వ్యవస్థలను ఇందులో పరిచయం చేసింది బజాజ్.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

సరికొత్త మోడిఫైడ్ పల్సర్ 200ఎన్ఎస్ ముందు భాగంలోని డ్యూయల్ హెడ్ ల్యాంప్స్ మధ్య త్రిశూలాకార చిహ్నాన్ని అందించారు, ముందు వైపున ఉన్న చిన్న పాటి విండ్ షీల్డ్ అదే విధంగా అధునాతన ఇంస్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

కార్బన్ ఫైబర్ తొడుగులు గల హ్యాండిల్ బార్, క్లచ్ మరియు ముందు బ్రేకుల కోసం కొత్త లీవర్లు, పదునైన డిజైన్‌లో ఉన్న వెనుక భాగం, నూతన సీటు మరియు ఎల్ఇడి టెయిల్ లైట్లతో పాటు వెనుక వైపున పెటల్ డిస్క్ బ్రేకులు కలవు.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

దేశీయంగా విడుదలైన పల్సర్ 200ఎన్ఎస్ కు ఏ మాత్రం సరితూగని దీని స్టిన్నింగ్ డిజైన్ అచ్చం 1-లీటర్ సామర్థ్యం గల కవాసకి జడ్1000 ను పోలి ఉంది.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

సాంకేతిక, డిజైన్ మరియు ఫీచర్లను మినహాయిస్తే రహదారి మీద దీని రైడింగ్ అనుభూతిని ఎలా ఉంటుందనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. అయితే కవాసకి జడ్1000 ను రైడింగ్ చేసిన అనుభూతిని పొందడం ఖాయం.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

త్వరలో విడుదల చేయనున్న ఈ నూతనపల్సర్ 200ఎన్ఎస్ మీద బజాజ్ భారీ అంచనాలను పెట్టుకుంది.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

బజాజ్ లోని ఫ్యూయల్ ఇంజెక్షన్ వెర్షన్ 200ఎన్ఎస్ బైకు ఇప్పటికే టర్కీ, లండన్, ఇండోనేషియా మరియు వియత్నాం వంటి దేశాల్లో అమ్మకాలు సాగిస్తోంది.

పల్సర్ 200ఎన్ఎస్ స్పోర్ట్స్ బైకు

అయితే దీనిని దేశీయంగా విడుదల అంశంపై బజాజ్ ఇంకా స్పందించలేదు. ఇప్పటికే పలుమార్లు దేశీయంగా దీనికి పరీక్షలు నిర్వహించింది కాబట్టి దీనిని విడుదల తద్యం అని తెలుస్తోంది.

భారతీయులకు అత్యంత ముఖ్యమైన ఫీచర్

భారతీయులకు అత్యంత ముఖ్యమైన ఫీచర్

ఇండియన్ మార్కెట్లోకి అనేక అంతర్జాతీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను విడుదల చేస్తూనే ఉన్నాయి. అయితే అన్నింటిలో ముఖ్యమైన యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మాత్రం పరిచయం కాలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు బజాజ్ పథకం వేస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2016, 13:46 [IST]
English summary
Read In Telugu: This Bajaj Pulsar 200NS Has Been Blinged Up To Its Core
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+