పల్సర్ 220ఎఫ్ అప్‌డేటెడ్ ఎడిషన్ విడుదల: ధర రూ. 91,201 లు

బజాజ్ ఆటో తమ పల్సర్ 220ఎఫ్ ను అప్‌డేటెడ్ వర్షన్‌లో బిఎస్-IV ఇంజన్‌తో నేడు (డిసెంబర్ 19, 2016) మార్కెట్లోకి విడుదల చేసింది.

By Anil

బజాజ్ ఆటో ఇండియన్ మార్కెట్లోకి తమ అప్‌డేటెడ్ వెర్షన్ బైకును బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ జోడింపుతో నేడు(డిసెంబర్ 19, 2016) ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సరికొత్త పల్సర్ 220ఎఫ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 92,201 లు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉన్నట్లు బజాజ్ తెలిపింది.

పల్సర్ 220ఎఫ్

బజాజ్ ఆటో తమ అప్‌డేటెడ్ 2017 పల్సర్ 220ఎఫ్ బైకులో 220సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ గల బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్‌ను అందించింది. ఈ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ను అనుసంధానం చేశారు.

పల్సర్ 220ఎఫ్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ 8,500ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 20.76బిహెచ్‌పి పవర్ మరియు 7,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 19.12 గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పల్సర్ 220ఎఫ్

ప్రభుత్వ నియమాల ప్రకారం వచ్చే ఏడాది 2017 ఏప్రిల్ నుండి ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యే ప్రతి బైకు కూడా బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే ఇంజన్ తప్పనిసరి. దానిని దృష్టిలో ఉంచుకుని బజాజ్ పల్సర్ 220ఎఫ్ 2017 వేరియంట్లో బిఎస్-IV ఇంజన్‌ను అందించింది.

పల్సర్ 220ఎఫ్

2017 బజాజ్ పల్సర్ 220ఎఫ్ వేరియంట్లో ముందు వైపున 260ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 230ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు కలవు. 15-లీటర్ల ఇంధన స్టోరేజీ సామర్థ్యం గల దీని మొత్తం బరువు 150కిలోలుగా ఉంది.

పల్సర్ 220ఎఫ్

బజాజ్ విడుదల చేసిన సరికొత్త 2017 పల్సర్ 220ఎఫ్ వేరియంట్ డిజైన్ పరంగా స్వల్ప మార్పులకు గురయ్యింది. వెనుక వైపున ఉన్న లైటు, మరియు ఆరేంజ్ రంగులో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ నీలం రంగులో వచ్చింది.

పల్సర్ 220ఎఫ్

కొత్త కలర్ పెయింట్ స్కీమ్‌లో అధునాత బాడీ డీకాల్ డిజైన్‌లో కలదు ఈ సరికొత్త పల్సర్ 220ఎఫ్. అదే విధంగా గతంలో సిల్వర్ రంగులో ఉన్న ఎగ్జాస్ట్ గొట్ట మట్టీ బ్లాక్ ఫినిషింగ్‌తో వచ్చింది.

పల్సర్ 220ఎఫ్

  • మనోరంజనకరమైన మారుతి స్విఫ్ట్ న్యూ జనరేషన్
  • త్వరలో విడుదల కానున్న బజాజ్ 150 ఎన్ఎస్ టీజర్ విడుదల
  • గంటకు 12,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే హైపర్ లూప్: ముంబాయ్ మరియు పూనేల మధ్య

More from DriveSpark

Article Published On: Friday, December 9, 2016, 20:56 [IST]
English summary
2017 Bajaj Pulsar 220F Launched; Priced At Rs 91,201
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+