2017 పల్సర్ 220ఎఫ్ ను విడుదల చేసిన బజాజ్
బజాజ్ ఆటో దేశీయ విపణిలోకి తమ అప్‌డేటెడ్ పల్సర్ 220ఎఫ్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. సరికొత్త పల్సర్ 220ఎఫ్ బిఎస్4 ఇంజన్ మరియు ఇతర మార్పులతో వచ్చింది.
దేశీయ దిగ్గజ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో విపణిలోకి అప్‌డేటెడ్ పల్సర్ 220ఎఫ్ మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. 2017 పల్సర్ 220ఎఫ్ బిఎస్ 4 ప్రమాణాలను పాటించే కొత్త ఇంజన్‌తో విడుదలైంది.

2010 లో ఫ్యూయల్ ఇంజెక్టెడ్ సిస్టమ్ స్థానంలోకి కార్బోరేటర్ ను పరిచయం చేసారు. అయితే కార్బోరేటర్ పరంగా ఏ విధమైన మార్పులు చోటు చేసుకోలేదు.

బాడీ డీకాల్స్ మరియు వాటి మీద ఉన్న రంగుల్లో మార్పులు మాత్రమే కాదు. ఇంజన్‌లో కూడా మార్పులు జరిగాయి. మునుపటి తరానికి చెందిన ఇంజన్‌ను బిఎస్4 ఉద్గార నియమాలను పాటించే విధంగా అభివృద్ది చేసి ఈ సరికొత్త 2017 పల్సర్ 220ఎఫ్‌లో అందించారు.

ఈ సరికొత్త పల్సర్ 220ఎఫ్ లోని అప్‌డేటెడ్ ఇంజన్‌లో టైమింగ్ చైన్ యొక్క పనితీరులో స్వల్ప మార్పులు సంతరిచుకున్నట్లు సమాచారం. అయితే, సాంకేతికంగా జరిగిన మార్పుల గురించి బజాజ్ నుండి ఏ విధమైన సమాచారం లేదు.

ఇందులోని అధునాతన శక్తివంతమైన ఇంజన్ మృదువైన రైడింగ్‌కు ఇవ్వగలదు, ఉత్పమ పనితీరు పరంగా కావాల్సని మేరకు గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. సాంకేతికంగా అభివృద్ది చేయబడిన ఇంజన్ ద్వారా గరిష్ట మైలేజ్ పొందవచ్చు.

సరికొత్త పల్సర్ 220ఎఫ్ లోని 220సీసీ సామర్థ్యం గల సింగల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఇంజన్ ఇంజన్ 21బిహెచ్‌పి పవర్ మరియు 19.12ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయును.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్‌కు అదే 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడమైంది.

ఇతర మార్పుల్లో బ్లాక్ మరియు బ్లూ లైటింగ్‌లో ఉన్న ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మృదువైన కుషనింగ్ కోసం ప్రీమియమ్ సీటును, ఎరుపు మరియు నల్లటి రంగుల్లో ఉన్న అధునాతన బాడీ డీకాల్స్ కలవు.

మ్యాన్యుల్‌గా కూడా ఆపరేట్ చేయగల చోక్, బ్లాక్ అల్లాయ్ వీల్స్ మీద ఎర్రటి పట్టీ కలదు. మట్టీ బ్లాక్ ఫినిషింగ్ గల ఎగ్జాస్ట్ సిస్టమ్ కలదు.

సరికొత్త బజాజ్ పల్సర్ యొక్క ప్రారంభ వేరియంట్ ధర రూ. 91,000 లు ఎక్స్ షోరూమ్ (థానే)గా ఉంది. దీని ఆన్ రోడ్ ధర సుమారుగా రూ. 1,03,000 లుగా ఉండవచ్చు.

క్రితం మోడల్ పల్సర్ 220ఎఫ్ తో పోల్చుకుంటే ఈ అధునాతన బిఎస్ 4 ప్రమాణాలను పాటించే ఇంజన్ గల పల్సర్ 220ఎఫ్ బైకు ధర నాలుగు వేల రుపాయల అదనంగా ఉంది.


Click it and Unblock the Notifications








