బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు
ప్రస్తుతం సాధారణ బైకుల ప్రపంచంలో మంచి మార్కెట్‌ను సొంతం చేసుకున్న తరువాత బజాజ్ ఇప్పుడు క్రూయిజర్ సెగ్మెంట్లోకి తమ ఉత్పత్తులను తీసుకురానుంది. క్రూయిజ్ సెగ్మెంట్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్‌ను టార్గెట్ చేసుకుని బజాజ్ పల్సర్ సిఎస్400 బైకును మార్కెట్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తోంది. పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు క్రింది కథనంలో....

ఇంజన్ వివరాలు
రాయల్ ఎన్ఫీల్డ్ వారి ఉత్పత్తులకు పోటిని ఇవ్వాలంటే ముందుగా వాటిలో ఉన్న ఇంజన్ సామర్థ్యం ఇందులో ఉండాలి. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని 273.2సీసీ కెపాసిటి గల సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను వినియోగించనుంది.

పవర్ మరియు ట్రాన్స్‌మిషన్ వివరాలు
కెటిఎమ్ నుండి సేకరించిన ఈ ఇంజన్‌కు బజాజ్ సంస్థ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌ను అనుసంధానం చేసింది. తద్వారా ఇది 42 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వేగం మరియు మైలేజ్ వివరాలు
క్రూయిజ్ శ్రేణి బైకులలో వేగం అనేది ముఖ్యమైన అంశం. కాబట్టి ఇది సుమారుగా గంటకు 165 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెట్టే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఇందులోని శక్తివంతమైన ఇంజన్ లీటర్‌కు 25 నుండి 28 కిలోమీటర్ల మధ్య మైలేజ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

భద్రత
ఇందులో భద్రత పరంగా రెండు చక్రాలకు కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ముందు వైపు అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్‌ను కల్పించారు. కాబట్టి భద్రత పరంగా కాస్త మెరుగ్గానే ఉంది.

డిజైన్
డిజైన్ అనే అంశం ఈ మధ్య కాలంలో బైకుల మనుగడ మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. అందుకు ఉదాహరణ క్రూయిజ్ సెగ్మెంట్లో ఎన్నో ఏళ్ల పాటు రాయల్ ఎన్ఫీల్డ్ తమ అన్ని ఉత్పత్తులను దాదాపుగా ఒకే విధమైన డిజైన్‌లో అందిస్తోం్ది. ఇక సిఎస్400 విషయానికి వస్తే ఇది అచ్చం పల్సర్ కుటుంబంలో ఉన్న మిగతా బైకులను పోలి ఉంటుంది. అయితే కెటిఎమ్‌లో ఉన్నటువంటి మలచబడిన ఇంధన ట్యాంకు, ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్ లతో పాటు నూతన తరహా ఎగ్జాస్ట్ వ్యవస్థ ఇందులో కలదు.

ఫీచర్లు
- దూర ప్రాంత ప్రయాణాలకు అనువుగా ఉండే హ్యాండిల్ బార్ డిజైన్
- ట్యాంక్ మీద ఉన్న డిజిటల్ డిస్ల్పే,
- హ్యాలోజన్ హెడ్ ల్యాంప్స్

విడుదల వివరాలు
బజాజ్ ఆటో ఈ క్రూయిజ్ విభాగానికి చెందిన సిఎస్400 బైకును 2016 మే చివరిలో మార్కెట్లోకి విడుదల చేసే సన్నాహాలు చేస్తోంది. విడుదల చేసే సమయం ప్రకటించే నాటి నుండి దీనికి సభందించిన బుకింగ్స్‌ను బజాజ్ డీలర్ల వద్ద ప్రారంభంచినున్నారు.

ధర వివరాలు
బజాజ్ ఈ పల్సర్ సిఎస్400 బైకులో కెటిఎమ్ 390 బైకు యొక్క ఇంజన్‌ను వినియోగించుకున్నప్పటికీ కెటిఎమ్ యొక్క ధరలతో పోటిగా దీనిని అందుబాటులోకి తేవడం లేదు. దాని కన్నా తక్కువగా రెండు లక్షలు లేదా అంతకన్నా తక్కువగానే అందుబాటులో ఉండనుంది.

పోటిదారులు
ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న క్రూయిజ్ సెగ్మెంట్‌ని మొత్తం రాయల్ ఎన్ఫీల్డ్ ఆక్రమించేసింది. చెన్నై ఆధారిత రాయల్ ఎన్ఫీల్డ్‌కు మరియు మహీంద్రా వారి మోజో బైకుతో కూడా ఈ పల్సర్ సిఎస్400 బైకు పోటీ పడనుంది.

గత ఆర్థిక సంవత్సరంలో ఎక్కువగా అమ్ముడుపోయిన టాప్10 టూ వీలర్లు: మొదటి స్థానంలో ఏ బైకుందో తెలుసా ?
ఇన్నోవా క్రిస్టాను ఇష్టపడేవారి కోసం మాత్రమే: టెస్ట్ డ్రైవ్ సంభందించి సమగ్ర విమర్శను చదవండి


Click it and Unblock the Notifications








