బజాజ్ పల్సర్ నుండి సిఎస్ 400: మరిన్ని వివరాలు కోసం...
స్పోర్ట్స్ బైకులు అందివ్వడంలో బజాజ్ టూ వీలర్స్ వారు ఎప్పుడు తనదైన ముద్రవేసుకుంటోంది. 2014 ఆటో ఎక్స్ పోలో పల్సర్ ఎస్ఎస్400 మరియు సిఎస్400 లను ప్రదర్శించింది. అయితే ప్రస్తుతం జరగనున్న ఆటో ఎక్స్ పోలో కూడా బజాజ్ ఈ పల్సర్ సిఎస్ 400 ను ప్రదర్శించనుంది.

బజాజ్ టూ వీలర్స్ వారు ఈ పల్సర్ సిఎస్ 400 ను ఫిబ్రవరి 1, 2016 న విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరియు దీనిని రెండు లక్షలలోపు ధరతో అందుబాటులోకి తీసుకురానుంది.
బజాజ్ పల్సర్ సిఎస్ 400 బైకులో 373.6 సీసీ కెపాసిటి గల సింగల్ సింగిల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది దాదాపుగా 33 బిహెచ్‌పి పవర్ మరియు 35 ఎన్ఎమ్ అత్యధిక టా ర్క్‌మను ఉత్పత్తి చేయును. మరియు దీని అత్యధిక వేగం గంటకు దాదాపుగా 155 కిలో మీటర్లు. ఇది మార్కెట్లోకి విడుదల అయితే మహీంద్రా వారి మోజో 300 మరియు కెటిఎమ్ 390 డ్యూక్ బైకులకు పోటిగా నిలవగలదు.
Also Read: మహీంద్రా గస్టో రివ్యూ: ఇలాంటి ఫీచర్లును ఇతర స్కూటర్లలో చూశారా?


Click it and Unblock the Notifications




