ప్రొడక్షన్ రెడి బజాజ్ పల్సర్ సిఎస్400 టెస్టింగ్: ఫోటోలు మరియు ఇతర వివరాలు
బజాజ్ ఎంతో కాలంగా దేశీయంగా విడుదల చేయాలని చూస్తోన్న బైకు సిఎస్400. 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద దీనిని మొదటి సారిగా ప్రదర్శించారు. పరీక్షలు జరిగిన తీరును గమనిస్తే దీనిని సరిగ్గా నెలలోపే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే భద్రతలో ఎంతో కీలకమైన ఫీచర్‌ను ఇందులో అందివ్వలేదని తెలిసింది.

ప్రస్తుతం ఆటోమొబైల్ ప్రపంచంలో ఫోర్ వీలర్లతో పాటు టూ వీలర్లలో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఎంతో ముఖ్యమైనది. కాని అందరూ ఊహించిన విధంగా ఇందులో ఏబిఎస్‌ను అందివ్వలేదు.

ఇది విడుదలయ్యే నాటికి 373సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ ఇంజన్ రానుంది.

ఈ ఇంజన్‌ను కేటిఎమ్ డ్యూక్ 390 నుండి సేకరించినట్లు సమాచారం. అయితే ఇది డ్యూక్ 390 కి పోటీనిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్ 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ట్రాన్స్‌మిషన్ ద్వారా వెనుక చక్రానికి సరఫరా అవుతుంది.

సిఎస్400 బైకు ముందు మరియు వెనుక రెండు చక్రాలకు స్పోర్ట్స్ BYBRE డిస్క్ బ్రేకులను అందించారు. దీని ద్వారా ఆప్షనల్‌గా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను అందించే అవకాశం ఉంటుంది.

సరికొత్త బజాజ్ సిఎస్400 బైకులో ముందు వైపున కన్వెన్షనల్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ కలదు.

ఇందులో కొత్తగా చెప్పుకునే విధంగా ఉన్నవాటిలో ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్ మరియు ఇంధన ట్యాంకు మీద సెకండరీ డిస్ల్పే ఉన్నాయి.

నెట్టుర నెట్టు హైలెస్సా.. జోరుగా నెట్టు హైలెస్సా...


Click it and Unblock the Notifications








