రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

By Anil

బజాజ్ ఆటో తమ మొట్ట మొదటి పూర్తి స్థాయి స్పోర్ట్ బైకును కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే దేశీయ అతి పెద్ద ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ తమ ఆర్ఎస్200 అంతర్జాతీయ మార్కెట్లకు కూడా పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.

అందులో భాగంగా బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 కొలంబియా మార్కెట్లో కొలువుదీరింది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 గురించి మరిన్ని వివరాలు.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

సరికొత్త పెయిటింగ్ రూపంలో దర్శనమిచ్చిన ఇచ్చిన ఇది ఇండియాలో కన్నా విదేశాల్లోనే ఎంతో కొత్తగా కనబడుతోంది. తెలుపు మరియు ఎరుపు రంగుల మేళవింపుతో ఉన్న ఇది స్పోర్టివ్‌ లుక్‌తో ముందున్న వాటి కన్నా ఎంతో ఆకర్షణీయంగా ఉంది.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఆర్ఎస్ 200 కేవలం మూడు రంగుల్లో మాత్రమే లభ్యమవుతోంది. అవి డమోన్ బ్లాక్, పసుపు మరియు ఎరుపు రంగుల్లో. అయితే కొలంబియాలో ఉన్న ఈ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ ఆర్ఎస్200 దేశీయంగా కూడా అందుబాటులోకి వస్తా అనే విషయం గురించి బజాజ్ ఆటో నుండి ఏవిధమైన సమాచారం లేదు.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

కొలంబియా కోసం ఆకర్షణీయంగా తీర్చిదిద్దబడిన ఆర్ఎస్200 లో డ్యూయల్ ఛానెల్ యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అందించారు. అయితే ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆర్ఎస్200 లో ఒక వైపున యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆప్షనల్‌గా అందించారు. రెండు వైపులా ఏబిఎస్ మరియు నూతన కలర్ ఆప్షన్లు తప్ప మరే ఇతర మార్పులు ఇందులో చోటు చేసుకోలేదు.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

ఈ బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 లో 199.5 సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

ఇందులో అందించిన ఇంజన్ సుమారుగా 24.50బిహెచ్‌పి పవర్ మరియు 18.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

పల్సర్ ఆర్ఎస్200 లోని ఇంజన్‌కు 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

బజాజ్ పల్సర్ ఆర్200 గరిష్ట వేగం గంటకు 141 కిలోమీటర్లుగా ఉంది.

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు

రెడ్ అండ్ వైట్ పెయింట్ స్కీమ్‌లో బజాజ్ పల్సర్ ఆర్ఎస్200

ఏడు కొత్త బైకులను విడుదల చేయనున్న బజాజ్

Source

More from DriveSpark

Article Published On: Thursday, July 7, 2016, 17:50 [IST]
English summary
New White & Red Paint Scheme Showcased On Pulsar RS200
Read more on: #బజాజ్
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+