బజాజ్ నుండి వి15 తరహాలో వి12 బైకు
బజాజ్ ఆటో వి శ్రేణి మోటార్ సైకిల్‌ను 125సీసీ సామర్థ్యంతో విడుదల చేయడానికి సిద్దమవుతోంది. గతంలో ఐఎన్ఎస్ విక్రాంత్ లోహంతో విడుదలైన వి15 బైకు మంచి విజయాన్ని అందుకుంది.
బజాజ్ ఆటో ఈ ఏడాది ప్రారంభంలో వి15 అనే బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌక యొక్క లోహంతో పురుడుపోసుకున్న ఈ వి15 ఆ సింపథితో మంచి పాపులారిటీని దక్కించుక్కుంది. అయితే వి15 తరహాలో 125సీసీ సామర్థ్యం గల ఇంజన్‌తో బజాజ్ వి12 అనే బైకును అభివృద్ది చేస్తోంది.

వి బైకు ద్వారా సాధించిన విజయాన్ని అలాగే కొనసాగించడానికి వి శ్రేణిలోని ఉత్పత్తులను పెంచడానికి బజాజ్ సిద్దమైంది. అందుకోసం తక్కువ కెపాసిటి గల ఇంజన్‌తో వి శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని అభివృద్ది చేయాలని యోచిస్తోంది.

బజాజ్ ఈ వి శ్రేణిలోని రెండవ బైకుకు వి125 లేదా వి12 అనే వాటిలో ఒక పేరును ఖరారు చేయనుంది.

వి125 లో 125 సీసీ సామర్థ్యం గల ఇంజన్ ను పరిచయం చేస్తోంది. ఇది బజాజ్ లైనప్‌లో ఉన్న మునుపటి 125సీసీ ఇంజన్‌లతో పోల్చుకుంటే మంచి మైలేజ్ మరియు పనితీరును ప్రదర్శిస్తుంది.

సరికొత్త వి125 లోని ఇంజన్ 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానంతో రానుంది. ప్రస్తుతం "వి" బైకు ఉన్న అదే డిజైన్ శైలిలో ఈ 125సీసీ బైకును పరిచయం చేసే అవకాశం ఉంది.

అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ లోహాన్ని ఈ 125 సీసీ బైకులో వినియోగించడం లేదు. అయితే కేఫ్ రేసర్ థీమ్ ను ఇందులో అలాగే కొనసాగించనుంది.

త్వరలో 125సీసీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకుల్లో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి అవడం వలన ఈ బజాజ్ వి125 ఏబిఎస్ ఫీచర్‌తో రానుంది.

బజాజ్ లైనప్‌లో ఉన్న 125సీసీ ఉత్పత్తుల్లో ఈ వి125 బైకు ప్రీమియమ్ 125 ఉత్పత్తిగా నిలవనుంది. మరియు ఇందులోని ఇంజన్ బిఎస్ 4 ఉద్గార నియమాలను పాటించే దిశగా అభివృద్ది చేస్తున్నారు.

బజాజ్ యొక్క ఆధునిక 125సీసీ సామర్థ్యం ఉన్న వి12 లేదా వి125 బైకు 53,000 రుపాయల ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న వి15 బైకు డిజైన్‌లోనే ఎక్కువ కలర్ ఆప్షన్‌లో రానుంది.

ఈ ఏడాది ముగిసేనాటికి బజాజ్ తమ వి12 బైకును విడుదల చేసే సూచనలు కనిపించాయి. అయితే బజాజ్ డొమైనర్ 400 కారణంగా వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది.

- మారుతి సుజుకి సియాజ్ హైబ్రిడ్ కారుకు తొలి పోటీ
- స్కూటర్ల రాజ్యం: దేశీయంగా విడుదల కానున్న స్కూటర్లు
- బజాజ్ నుండి మరో సంచలనాత్మక మోడల్: డొమైనర్ 400


Click it and Unblock the Notifications








