బజాజ్ వి బైకు విడుదల సమాచారం మరియు ఫోటోలు
బజాజ్ టూ వీలర్స్ వారు స్వల్ప కాలవ్యవధిలోనే అత్భుతమైన టూ వీలర్ ను మార్కెట్లోకి విడుదల చేశారు. గత నెల రిపబ్లిక్ డే సందర్భంగా బజాజ్ టూ వీలర్స్ వారు విడుదల చేసిన టీజర్ చూసేంత వరకు కూడా దేశ వ్యాప్తంగా ఎవరికీ తెలియకుండా గోప్యంగా ఉంచారు. అసలు ఈ మాటలన్ని ఎవరి గురించి అని ఆలోచిస్తున్నారా..? అదే బజాజ్ టూ వీలర్స్ వారు క్రితం రోజున విడుదల చేసిన విక్రాంత్ మోటార్ సైకిల్స్ గురించి.

బజాజ్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ ఫోటోలు:
ఐఎన్ఎస్ విక్రాంత్ కి , వి మోటార్ సైకిల్స్ మధ్య ఉన్న సంభందం:
దేశ వ్యాప్తంగా గర్వంగా చెప్పుకునే ఏకైక యుద్ద నౌక ఐఎన్‌ఎస్ గురించి తెలియని వారు ఉండరు. ఈ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ 2014 వరకు దేశ రక్షణ కోసం సేవలు అందించింది. తరువాత దీనిని స్క్రాప్ యార్డుకు తరలించారు.
అయితే బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ఈ ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ద నౌకకు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. ఎందుకంటే విక్రాంత్ నౌకను సేకరించి అందులోని విడిభాగాలను కరిగించి వి మోటార్ సైకిల్స్‌ను తయారు చేశారు. బజాజ్ వారు విక్రాంత్ నౌకకు ప్రతీకగా వి మోటార్ సైకిల్స్ అని పేరు పెట్టారు.
Also Read: బజాజ్ వి మోటార్ సైకిల్స్ సాంకేతిక మరియు విడుదల వివరాల కోసం.
బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ప్రవేశ పెట్టిన వి మోటార్ సైకిల్స్ ధరలు దాదాపుగా రూ. 60,000 నుండి 70,000 వరకు ఉండనున్నాయి. అత్బుతమైన శైలిని కలిగిన ఈ వి మోటార్ సైకిల్స్ వారు హీరో మోటోకార్ప్ వారి సింగల్ సీటర్ బైకుకు ప్రత్యక్షంగా గట్టి పోటిని ఇవ్వనుంది. మార్చి నుండి ఈ బైకులను దేశ వ్యాప్తంగా అమ్మకాలను ప్రారంభించనున్నారు.


Click it and Unblock the Notifications


























































