INS విక్రాంత్ యుద్ద నౌకకు ప్రాణం పోసిన బాజాజ్ వి మోటార్ సైకిల్స్
భారత దేశం పాకిస్తాన్ తో యుద్దం చేస్తున్న సమయంలో భారత దేశపు యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ విపరీతమైన సేవలు అందించింది. ఆ తరువాత పాకిస్తాన్ భారత్ చేతలో భయంకరంగా ఓడిపోయింది. కారణం మన దేశీయులు గర్వంగా చెప్పుకునే విక్రాంత్ నౌక వలన.
అయితే ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక సేవలు అందించడం నిలిపివేసిన తరువాత దీనిని స్క్రాప్ యార్డ్ కు తరలించారు. దేశీయంగా గల టూ వీలర్ల తయారీ సంస్థ బజాజ్ ఈ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక విడిభాగాలను ఉపయోగించుకుని టూ వీలర్లను తయారూ చేయడం మొదలు పెట్టింది. దీనికి సంభందించిన మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.
Also Read: టీవీఎస్ అపాచే రీ ఎంట్రీ: డ్యూక్‌ను ఓవర్‌టేక్ చేయడం సాధ్యమేనా ?
భారతీయ రక్షణ రంగంలో ఐఎన్‌ఎస్ విక్రాంత్ యుద్ద నౌక పని తీరు అత్భుతం. కాని కాలానుగమనంలో విక్రాంత్ నౌక సేవలు విలిపివేసిన తరువాత దీనిని ప్రక్కకు పెట్టారు.

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ఈ నౌకలోని విడి భాగాలను ఉపయోగించి టూ వీలర్లను తయారు చేయడం ప్రారంభించారు.

ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక యొక్క్ సేవలకు గుర్తుగా బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ఈ బైకులకు బజాజ్ వి అని పేరు పెట్టారు. అయితే ఇది కేవలం కోడ్ పేరు మాత్రమే అని తెలిపారు.

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ఈ టూ వీలర్స్ ను ఫిబ్రవరి 1, 2016 న ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. అయితే గణతంత్ర దినోత్సవం సంధర్బంగా బజాజ్ మోటార్ సైకిల్స్ వారు దీనికి సంభందించిన టీజర్ ను విడుదల చేశారు ప్రస్తుతం ఇది నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.

బజాజ్ మోటార్ సైకిల్స్ వారు విక్రాంత్ యుద్ద నౌక లోహంతో తయారు అవుతున్న ఈ మోటార్ సైకిల్స్‌ను లిమిటెడ్ ఎడిషన్ గా మాత్రమే అందించనున్నారు.

విక్రాంత్ పేరు రానున్నఈ బజాజ్ టూ వీలర్లలో 150 సీసీ కెపాసిటి గల ఇంజన్ ను అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌక యొక్క లోహం ఉపయోగించి తయారు చేసినట్లు తెలుపుతున్న మోటార్ సైకిల్‌లోని ఒక విడిభాగం.

బజాజ్ మోటార్ సైకిల్స్ ద్వారా ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌకకు ప్రాణం పోసినట్లు తెలిపే చిత్రమాళిక.

ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను కరిగించి బజాజ్ మోటార్ సైకిల్స్ విడి భాగాలను తయారు చేస్తున్న దృశ్యం.

బజాజ్ టూ వీలర్స్ వారు ఈ సరికొత్త మోటార్ సైకిల్స్ ను ఫిబ్రవరి 1, 2016 న ఆవిష్కరించనున్నారు.

ఐఎన్ఎస్ నౌక ద్వారా వి పేరుతో బజాజ్ టూ వీలర్స్ వారు మోటార్ సైకిల్స్‌ను తయారు చేస్తున్నట్లు తెలిపే టీజర్ వీడియోను కథనం క్రింది భాగంలో మీరు చూడవచ్చు.

- మహీంద్రా నుండి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
- భారతీయ మార్కెట్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు: ఇందులో మీ కారు ఉందా?


Click it and Unblock the Notifications








