ఐఎన్ఎస్ విక్రాంత్ లోహంతో తయారైన బజాజ్ "వి" విడుదల: పూర్తి వివరాలు
కమ్యూటర్ బైకులకు రారాజుగా బజాజ్ మోటార్ సైకిల్స్ వారు దేశీయ మార్కెట్లోకి వి మోటార్ సైకిల్స్ ను విడుదల చేశారు. భారత్ ప్రఖ్యాత మొదటి ఎయిర్ క్రాఫ్ట క్యారీయర్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక నుండి సేకరించిన లోహం ద్వారా ఈ వి మోటార్ సైకిల్స్ ఊపిరి పోసుకున్నాయి.
విక్రాంత్ నౌక విడి భాగాలను కరిగించి రూపొందించిన వి మోటార్ సైకిల్స్ గురించి పూర్తి వివరాలను క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

ఇంజన్ వివరాలు
ఐఎన్‌ఎస్ ద్వారా రూపుదిద్దుకున్న వి మోటార్ సైకిల్‌లో 150సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు. దీనిని పూర్తిగా విక్రాంత్ విడిభాగాలను కరిగించి తయారు చేశారు.

టార్క్
వి మోటార్ సైకిల్‌లో ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంజన్ 3000ఆర్‌పిఎమ్ వద్ద 12 ఎన్ఎమ్ టార్క్ మరియు 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

శక్తి
వి మోటార్ సైకిల్ టార్క్‌తో పాటు ఉత్తమ శక్తిని కూడా ఇస్తుంది. ఇది 7,500 ఆర్‌పిఎమ్ వద్ద దాదాపుగా 12 బిహెచ్‌పి పవర్ ని అందిస్తుంది.

ట్రాన్స్‌మిషన్
చక్కటి టార్క్ మరయు అత్భుమైన శక్తి ఇవ్వడాని ఇందులో ఉన్న ఇంజన్‌కు బజాజ్ మోటార్ సైకిల్స్ వారు 5-స్పీడ్ గేర్ బాక్స్ గల ట్రాన్స్‌మిషన్‌ను జోడించారు.

సస్పెన్షన్
బజాజ్ మోటార్ సైకిల్స్‌లో సస్పెన్షన్‌కు కూడా మంచి స్థానం కల్పించారు. ఇందులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపున నైట్రాక్స్ షాక్ అబ్జార్వర్లను కల్పించారు.

వేగ నిరోధకాలు (బ్రేకులు)
బజాజ్ టూ వీలర్ల సంస్థ ఈ వి మోటార్ సైకిల్స్‌లో ముందు వైపున డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులను కల్పించారు.

అల్లాయ్ చక్రాలు
బజాజ్ వి మోటార్ సైకిల్స్‌లో ముందు వైపున 18 అంగుళాల గల ధృడమైన చక్రం మరియు వెనుకవైపున 16 అంగుళాలు కలగి అత్యంత ధృడమైన అల్లాయ్ వీల్ కలదు.

బజాజ్ వి మోటార్ సైకిల్స్ ఫీచర్లు
- 13-లీటర్ల ఇంధన సామర్థ్యం
- టాల్ స్టేన్స్ (పొడవైన ఆకృతి)
- కండలు వంటి గ్రాఫిక్స్ గల డీకాల్స్
- ట్విన్ స్పోక్ అల్లాయ్ వీల్స్
- రేసర్ బైకు వంటి భావనలు కలిగి ఉంది
- 60 వాట్స్ గల హెడ్ లైట్
- ఎల్‌ఇడి టెయిల్ ల్యాంప్స్
- ఉద్రిక్తల వంటి ఎగ్జాస్ట్ సౌండ్
- రంగులు మారే ఎల్‌ఇడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్
- అత్యధికంగా అల్యూమినియం పూత పూయబడిన పరికరాలు
- ఎబోని బ్లాక్
- పియర్ల్ వైట్
- ఎలాగో కొనలేము కనీసం ఓ చూపు చూద్దాం రండి
- రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఎలా ఉంటుందో తెలిసిపోయింది...!!
- కేవలం 49,490 లకే 79 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగల టూ వీలర్

బజాజ్ వి మోటార్ సైకిల్స్ ఫీచర్లు

ఒక్కరికి మాత్రమే
బజాజ్ మోటార్ సైకిల్స్ వారు దీనిని కేవలం ఒక్కరు మాత్రమే ప్రయాణించడానికి వీలుగా ఉండే విధంగా రూపొందిస్తున్నారు. సీటు వెనుకవైపున గిన్నె ఆకారంలో ఉండే డిజైన్ అందించారు. ఇది బాడీ కలర్‌ను కలిగి ఉంటుంది.

లభించు రంగులు
బజాజ్ టూ వీలర్స్ వారి వి మోటార్ సైకిల్స్ రెండు విభిన్న రంగుల్లో లభించును.

టార్గెట్
బజాజ్ మోటార్ సైకిల్స్ వారు ఈ కమ్యూటర్ వి బైకులను నెలకు 20,000 చెప్పున అమ్మకాలను నిర్ధేశించుకున్నట్లు తెలిపారు.

ఫిబ్రవరి 5 న
ఫిబ్రవరి 5 వ తేదీ నాటికి ఉత్పత్తికి సిద్దమైన వి మోటార్ సైకిల్స్ ను ప్రదర్శించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. మరియు మార్చికల్లా మార్కెట్లోకి అమ్మకాలకు సిద్దం చేయనున్నారు.

ధర
బజాజ్ వి మోటార్ సైకిల్ ధర దాదాపుగా రూ. 60,000 నుండి 70,000 ల మధ్య ఉండవచ్చు.

పోటి
దీని మార్కెట్లోకి విడుదల చేస్తే ప్రస్తుతం దేశీయంగా మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని 150 సీసీ కమ్యూటర్ బైకులకు పోటిగా నిలవనుంది. ముఖ్యంగా హీరో మోటోకార్ప్ వారు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉంచిన సిగంల్ సీటర్ బైకుకి పోటిగా నిలవనుంది.

వీడియో
బజాజ్ వి మోటార్స్ సైకిల్స్ విడుదల చేస్తున్నప్పటి ప్రత్యక్ష వీడియో కథనం క్రింది భాగంలో కలదు వీక్షించండి.



Click it and Unblock the Notifications








