ఇండియన్ మార్కెట్లోకి బెనెల్లీ కెఫెనెరో 150 : స్పై ఫోటోలు
ఇండియాలో ఉన్న స్కూటర్లు చాలవన్నట్లుగా ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ బెనెల్లీ దేశీయ మార్కెట్లోకి సరికొత్త కెఫెనెరో 150 స్కూటర్‌ను తీసుకురానుంది. దీనికి సంభందించి భారతీయ రోడ్ల మీద తమ కెఫెనెరోకు రహస్య పరీక్షలు నిర్వహించింది.
బెనెల్లీ కెఫెనెరో 150 స్కూటర్‌కు చెందిన మరిన్ని వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బెనెల్లీ సంస్థ తమ కెఫెనెరో 150 స్కూటర్‌కు మహరాష్ట్రలోని పూనేకు దగ్గరలో గల నాలుగవ నెంబర్ జాతీయ రహదారి మీద పరీక్షలు నిర్వహించారు.

బెనెల్లీ సంస్థ తమ టూ వీలర్లలో డిజైన్‌కు అధిక ప్రాముఖ్యతను ఇస్తుంది. ముందు వైపున కండలు తిరిగిన ఆకారం వంటి మస్కలర్ డిజైన్, యాంగులర్ హెడ్ ల్యాంప్స్ మరియు పెద్దగా ఉన్న విండ్ స్క్రీన్ కలదు.

కెఫెనెరోలో ఫీచర్లు పరంగా 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ రెండు వైపులా, రెండు చక్రాలు కూడా డిస్క్ బ్రేకులను కలిగి ఉన్నాయి. వెనుక వైపున రెండు షాక్ అబ్జార్వర్లను అందించారు. దీనికి తోడుగా బాగా ఎత్తులో ఉన్నటువంటి సీటు కలదు.

బెనెల్లీ కెఫెనెరో 150 స్కూటర్‌లో 150సీసీ కెపాసిటి గల ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ దాదాపుగా 13.4 బిహెచ్‌పి పవర్ ను ఉత్పత్తి చేస్తుంది.

బెనెల్లీ కెఫెనెరో 150 స్కూటర్ బరువు దాదాపుగా 150 కిలోలుగా ఉంది.

ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదల అయితే అప్రిలియా ఎస్‌ఆర్ 150 స్కూటర్‌తో పోటా పోటిగా ఉండనుంది.
- అప్రిలియా ఎస్‌ఆర్-150 స్కూటర్ గురించి చదవండి
- ఫిబ్రవరిలో వీటిదే పైచేయి
- క్షణంలో శత్రువుల మీద దాడి చేసే భారతదేశపు రహస్య ఆయుధం 'కాళీ'



Click it and Unblock the Notifications








