150సీసీ సామర్థ్యంతో చౌక బైకును అభివృద్ది చేస్తున్న బెనెల్లీ

By Anil

ఇటలీకి చెందిన ఖరీదైన స్పోర్ట్ బైకుల తయారీ సంస్థ తమ లైనప్‌లోకి అత్యంత సరసమైన మరియు తక్కువ సామర్థ్యం గల 150సీసీ బైకును అందుబాటులోకి తీసుకురానుంది. బెనెల్లీ నుండి తాజాగా విడుదలైన 150సీసీ బైకు యొక్క పేటెంట్ చిత్రం ప్రకారం దీనిని ఫుల్లీ ఫెయిర్డ్ ఉత్పత్తిగా డిజైన్ చేస్తోందని స్పష్టం అవుతోంది.

బెనెల్లీ డ్రాగన్ 150

డ్రాగన్ 150 అనే పేరుతో అందుబాటులోకి రానున్న ఈ బైకు ముందుగా ఆగ్నేయాసియా దేశాలలోని మార్కెట్లోకి విడుదల కానుంది. బెనెల్లీ సామ్రాజ్యంలో అతి తక్కువ సామర్థ్యంతో తయారవుతున్న దీనిని పూర్తిగా ప్రత్యేకమైన ఫ్లాట్‌ఫామ్ మీద రూపొందిస్తున్నారు.

బెనెల్లీ డ్రాగన్ 150

బెనెల్లీ ఈ బైకులో 150సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్‌ను అందివ్వనుంది. ఖరీదైన ఉత్పత్తుల అందించే బెనెల్లీ నుండి రానున్న ఇది తక్కువ ధరతో అందుబాటులోకి వస్తే మిగిలిన చిన్న చిన్న ఉత్పత్తుల అమ్మకాలు దాదాపుగా ఆగిపోయి పరిణామం రానుంది.

బెనెల్లీ డ్రాగన్ 150

బెనెల్లీ సంస్థ నుండి విడుదలయిన పేటెంట్ చిత్రాన్ని తీక్షణంగా గమనిస్తే ఇందులోని చాసిస్, స్వింగ్ ఆర్మ్ మరియు ఇతర విడి భాగాలు బెనెల్లీ వారి టిఎన్ 15 తో పోల్చితే చాలా విభిన్నంగా ఉన్నాయి.

బెనెల్లీ డ్రాగన్ 150

పూర్తి స్థాయి డిజైన్, అల్లాయ్ చక్రాలు మరియు టెయిల్ సెక్షన్ డిజైన్ బెనెల్లీ టొరాండో 302 ఆర్ ను పోలి ఉన్నాయి.

బెనెల్లీ డ్రాగన్ 150

బెనెల్లీ సంస్థ ముందుగా ఈ డ్రాగన్ 150 ను 2017 నాటికి చైనా విపణిలోకి విడుదల చేయనుంది. ఆ తరువాత మిగిలిన ఆగ్నేయాసియా దేశాలలోకి విడుదల చేయనుంది.

బెనెల్లీ డ్రాగన్ 150

బెనెల్లీ ఈ డ్రాగన్ 150 ని దేశీయంగా అందుబాటులోకి తీసుకువస్తే ప్రస్తుతం ఉన్న యమహా వైజడ్ఎఫ్-ఆర్15 మరియు హోండా సిబిఆర్150ఆర్ లకు పోటీగా నిలవనుంది.

బెనెల్లీ డ్రాగన్ 150

  • అత్యంత సరసమైన ధరకు టయోటా నుండి మరో సెడాన్
  • హైదరబాదీ ఖాకీల చేతికి ఈడర్ మోటార్ సైకిల్స్ ఛైర్మెన్
  • డ్యూయల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ గల పవర్ ఫుల్ బజాజ్ పల్సర్ ఆర్ఎస్200
  • బెనెల్లీ డ్రాగన్ 150

    ప్రమాదాల్లో మీ కారును రక్షించే కారు ఇన్సూరెన్స్‌లో విప్లవాత్మకమైన మార్పులు !! పూర్తి వివరాల కోసం....

More from DriveSpark

Article Published On: Wednesday, September 14, 2016, 17:21 [IST]
English summary
Read In Telugu: Benelli’s New 150cc Motorcycle In The Making
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+