బెనెల్లీ టిఆర్‌కె 502 అడ్వెంచర్ టూరర్ బైకు విడుదల
బెనెల్లీ టూ వీలర్ల సంస్థ దేశీయ మార్కెట్లోకి ఇప్పటి వరకు చాలా వరకు తమ ద్విచక్ర వాహనాలను అందిస్తూ వస్తోంది. అయితే మొదటి సారిగా దేశీయ మార్కెట్లోకి అడ్వెంచర్ టూరర్ బైకును ప్రవేశ పెట్టింది. బెనెల్లీ టిఆర్‌కె 502 అనే పేరుతో గత వారంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద దీనిని ప్రదర్శించింది. ఈ టిఆర్‌కె 502 కు చెందిన ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

డిజైన్:
పొడవైన హ్యాండిల్ బార్, ఎత్తులో డిజైన్ చేయబడిన ఎగ్జాస్ పైపులు ( పొగ గొట్టాలు) అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు పొడవైన సస్పెన్షన్‌లతో దీనిని తయారు చేశారు. మీరు దీనిని ముందు వైపు నుండి పరిశీలించినట్లయితే రెండుగా ఉన్న హెడ్ లైట్ డిజైన్ ఇట్టే ఆకట్టుకుంటుంది. మొత్తానికి ఈ బెనెల్లీ టిఆర్‌కె 502 అడ్వెంచర్ టూరర్ బైకు చూడటానికి కూల్‌గా ఉంటుంది.
Also Read: హోండా నుండి సరికొత్త నవీ స్కూటర్ ధర రూ. 39,500 లు మాత్రమే
సాంకేతిక వివరాలు:
- ఇంజన్ కెపాసిటి: 500సీసీ
- కూలింగ్ సిస్టమ్: ఆయిల్ కూలింగ్
- పవర్: 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 48 బిహెచ్‌పి పవర్
- టార్క్: 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 45 ఎన్ఎమ్ టార్క్
- గేర్‌బాక్స్: 6-స్పీడ్ గేర్ బాక్స్
- డ్రైవ్: చెయిన్ డ్రైవ్
- ఇంధన ట్యాంకు సామర్థ్యం: 20-లీటర్లు
Also Read: 1.49 లక్షల ప్రారంభ ధరతో మూడు బైకులను విడుదల: వీటి దెబ్బతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికే
సస్పెన్షన్ మరియు బ్రేకులు:
అడ్వెంచర్ బైకులలో ముఖ్యంగా ఉండవలసినది మంచి సస్పెన్షన్ సిస్టమ్ మరియు బ్రేకులు. ఇందు కోసం బెనెల్లీ సంస్థ ఈ టిఆర్‌కె 502 బైకులో ముందు వైపున 50 ఎమ్ఎమ్ వరకు అడ్జెస్ట్ చేసుకునే సదుపాయం గల అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ప్రి లోడెడ్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకుల విషయానికి వస్తే ముందు వైపున ట్విన్ ఫ్లోటింగ్ నాలుగు పిస్టన్లు గల కాలిపర్‌తో ఉన్న 320 ఎమ్ఎమ్ చుట్టుకొలతతో రెండు డిస్క్ బ్రేకులు కలవు. వెనుకవైపున రెండు పిస్టన్లు గల కాలిపర్ 260 ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకు కలదు. రెండు బ్రేకులు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఆధీనంలో ఉంటాయి.
అందుబాటులోకి :
బెనెల్లీ ఈ టిఆర్‌కె 502 బైకును ఏడాది చివరికల్లా మార్కెట్లోకి తీసుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మరియు దీని ధర దాదాపుగా రూ. 5 లక్షల వరకు ఉండనుంది. అయితే మార్కెట్లోకి అందుబాటులోకి వస్తే సుజుకి వారి వి-స్ట్రీమ్ 650 బైకుతో పోటి పడనుంది.


Click it and Unblock the Notifications



































