దేశీయ మార్కెట్లోకి బెనెల్లీ టిఎన్‌టి 600ఐ (ఎబిఎస్) విడుదల
ప్రముఖ విదేశీ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బెనెల్లీ ఇండియన్ మార్కెట్లోకి యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ భద్రత ఫీచర్ గల సరికొత్త బెనెల్లీ టిఎన్‌టి 600ఐ బైకును విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 6.53 లక్షలు ఎక్స్ షోరూమ్ (పూనే)గా విడుదల చేసింది.
చిట్కాలు: 150సీసీ సెగ్మెంట్లో ఉత్తమ మైలేజ్ ఇవ్వగల టాప్-10 బైకులు
బెనెల్లీ మోటార్ సైకిల్స్ వారు ఈ 600 సీసీ బైకులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మినహాయించి ఎలాంటి ఇతర ఫీచర్లను అందివ్వలేదు. చాలా మంది బైకు ప్రేమికులు ఈ 600 సీసీ బెనెల్లీ బైకులో యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కోరుకునే వారి, బెనెల్లీ కూడా అలాంటి వినియోగదారుల కోసం ప్రత్యేకంగా దీనిని ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలిపారు.

బెనెల్లీ టిఎన్‌టి 600ఐ బైకులో 600 సీసీ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల ఇన్-లైన్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ మరియు 54.6ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉన్న ఇంజన్‌లో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కలదు.
బజాజ్ పల్సర్ సిఎస్400 గురించి 9 ముఖ్యమైన విషయాలు
బెనెల్లీ మోటార్ సైకిల్స్ సంస్థ తమ ఉత్పత్తులన్నింటిలో కూడా యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కల్పించనుంది. ఏడాదిలోపు వీలైనన్ని ఎక్కువ ఉత్పత్తులలో ఈ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు.
రాయల్ ఎన్ఫీల్డ్‌కు పోటీగా కవాసకి ఎస్ట్రెల్లా


Click it and Unblock the Notifications





















