భారతీయ మార్కెట్లోకి మరొక బెస్ట్ టూవీలర్: బెనెల్లీ టొరాండో 302
ఇటాలియన్‌కు చెందిన ప్రముఖ స్పోర్ట్స్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బెనెల్లీ తమ టొరాండో 302 బైకును గడిచిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో స్పోర్ట్స్ బైకుల అమ్మకాలలో కెటిఎమ్ మరియు కవసాకి తిరుగులేని అమ్మకాలను సాధిస్తున్నాయి. అయితే బెనెల్లీ టొరాండో 302 రాకతో వీటి పరిస్థతి ఆగమ్యగోచరంగా మారిందని చెప్పవచ్చు. బెనెల్లీ టొరాండో 302 బైకు ఫోటోల కోసం క్రింద గల ఇమేజ్ మీద క్లిక్ చేయండి.

బెనెల్లీ టొరాండో 302 సాంకేతిక వివరాలు
ఇంజన్ కెపాసిటి: 300సీసీ
పవర్: 12,000 ఆర్‌పిఎమ్ వద్ద 35 బిహెచ్‌పి
టార్క్: 9,000 ఆర్‌పిఎమ్ వద్ద 27 ఎన్ఎమ్ గరిష్ట టార్క్
గేర్‌బాక్స్: 6-స్పీడ్ మ్యాన్యువల్
0-60 కిమీ వేగం: 3.4 సెకండ్ల వ్యవధిలో
0-100 కిమీ వేగం: 8.38 సెకండ్ల వ్యవధిలో
అత్యధిక వేగం: గంటకు 154 కిలోమీటర్లు
Also Read: కత్రినా కైఫ్‌ను ఇలా ఎప్పుడైనా చూశారా ?
భద్రత మరియు సస్పెన్షన్ ఫీచర్లు:
స్పోర్ట్స్ బైకులకు వేగంతో పాటు ఆ వేగాన్ని నియంత్రించే ఫీచర్లు కూడా అంతే ముఖ్యం. ఇందుకోసం బెనెల్లీ తమ టొరాండో 302 బైకులో ముందు వైపు 41 ఎమ్ఎమ్ ట్రావెల్ గల అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్‌ను కల్పించారు. బ్రేకుల పరంగా ముందు వైపున 260 ఎమ్ఎమ్ గల రెండు డిస్క్ బ్రేకులను అదేవిధగా వెనుకవైపున 240ఎమ్ఎమ గల సింగిల్ డిస్క్ బ్రేకును అందించారు. రెండు చక్రాలు కూడా 17 అంగుళాల చుట్టు కొలతలతో ఉన్నాయి.
Also Read: లీటర్‌కు 100 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగల కారు విడుదల మరిన్ని వివరాలకు
ధర వివరాలు:
బెనెల్లీ తమ టొరాండో 302 బైకు ధరను దాదాపుగా 3 లక్షల వరకు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది మార్కెట్లోకి విడుదల అయితే ప్రస్తుతం దేశీయంగా అందుబాటులో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి 390 మరియు కవాసకి నింజా 300 బైకులకు గట్టి పోటీని ఇవ్వనుంది.
Recommended For You: 1.49 లక్షలతో మూడు బైకులను విడుదల చేసిన యుఎమ్ మోటార్ సైకిల్స్: వీటి దెబ్బతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటికే


Click it and Unblock the Notifications
















































