నవంబర్ 2015 లో టాప్-10 బెస్ట్ స్కూటర్లు ఇవే

By Anil

మార్కెట్లో ఇప్పుడిప్పుడే వృద్దిలోకి వస్తున్న టూవీవలర్స్ ఏవంటే స్కూటర్లు అని నిక్కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గత నాలుగైదు సవత్సరాల క్రింత కన్నా ఇప్పుడు స్కూటర్లు మార్కెట్ బాగా పెరిగింది. దీనికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. అందులో మంచి మైలేజ్, ఉత్తమమైన ధర మరియు అన్నింటికన్నా ముఖ్యమైనది సిటి రైడింగ్‌లో అత్భుతమైన పనితనం కనబరుస్తాయి.

ఇవే కారణాలతో ఎంతో వీటిని ఎంచుకుంటున్నారు. అయితే గత నవంబర్ నెలలో ఎక్కువ మంది భారతీయులు ఎంచుకున్న టాప్-10 స్కూటర్లు గురించి తెలుసుకుందాం రండి...

10. టివియస్ జెస్ట్

10. టివియస్ జెస్ట్

పదవ స్థానంలో ఉన్న టివియస్ జెస్ట్ స్కూటర్ ను 2015 నవంబర్‌లో దాదాపుగా 7,906 మంది కొనుగోలు చేశారు. 2014 నవంబర్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగానే అమ్మకాలు సాధించి తొమ్మిదవ స్థానం నుండి పదవ స్థానానికి ఇది చేరుకుంది.

ఇంజన్ వివరాలు: 110సీసీ కెపాసిటి గల ఇంజన్ 8బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.

మైలేజ్ ఇది లీటర్‌కు 62 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

 09. మాహీంద్రా గస్టో

09. మాహీంద్రా గస్టో

మహీంద్రా గస్టో గతవత్సరం ఇదే నెలలో ఈ లిస్ట్‌లో స్థానం సంపాదించుకోలేకపోయింది. అయితే ఈ సంవత్సరం నవంబర్‌లో 8,646 యూనిట్లు అమ్మకాలు జరిపి తొమ్మదవ స్థానంలో నిలించింది.

  • ఇంజన్ వివరాలు: 108సీసీ కెపాసిటి గల ఇంజన్ బిహెచ్‌పి పవర్ మరియు 9 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
  • మైలేజ్: ఇది లీటర్‌కు 61 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
  • ఆన్ రోడ్ ధర: రూ. 52,000 లు
  • 08. హీరో ప్లెసర్

    08. హీరో ప్లెసర్

    టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో స్థానం సంపాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచిన స్కూటర్ హీరో ప్లెసర్ నవంబర్ 2015 లో 12,387 యూనిట్ల అమ్మకాలు నమోదు చేసుకుంది.

    • ఇంజన్ వివరాలు: 102సీసీ కెపాసిటి గల ఇంజన్ 7బిహెచ్‌పి పవర్ మరియు 7.8 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
    • మైలేజ్: ఇది లీటర్‌కు 63 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
    • ఆన్ రోడ్ ధర: రూ. 51,000 లు
    • 07. సుజుకి యాక్సెస్

      07. సుజుకి యాక్సెస్

      జపాన్‌కు చెందిన సుజుకి స్కూటర్ల సంస్థ గత ఏడాది కన్నా ఈ యేడు తక్కువ యూనిట్ల అమ్మకాలు జరిపింది. గత ఏడాది నవంబర్ లో 20,234 యూనిట్లు అమ్మకాలు జరపగా ఈ సంవత్సరం నవంబర్‌లో 12,959 అమ్మకాలతో ఏడవ స్థానంలో నిలిచింది.

      ఇంజన్ వివరాలు: 124సీసీ కెపాసిటి గల ఇంజన్ 8.5బిహెచ్‌పి పవర్ మరియు 9.8 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.

      మైలేజ్: ఇది లీటర్‌కు 53 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

      ఆన్ రోడ్ ధర: రూ. 58,000 లు

      06. యమహా ఫ్యాసినొ

      06. యమహా ఫ్యాసినొ

      ఆరవ స్థానంలో ఉన్న యమహా వారి ఫ్యాసినొ స్కూటర్ 2015 మే నెలలో మార్కెట్లోకి విడుదల అయ్యింది. అయితే 2015 నవంబర్‌లో 13,078 యూనిట్లు అమ్మకాలు సాధించింది.

      • ఇంజన్ వివరాలు: 113సీసీ కెపాసిటి గల ఇంజన్ 7బిహెచ్‌పి పవర్ మరియు 8.1 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
      • మైలేజ్: ఇది లీటర్‌కు 46 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
      • ఆన్ రోడ్ ధర: రూ. 60,000 లు
      • 05.హోండా డియో

        05.హోండా డియో

        హోండా డియో చూడటానికి ఎంతో స్పోర్టివ్ గా ఉంటుంది.ముఖ్యంగా ఇది యువతకు ఎంతో బాగా సరిపోతుందని చెప్పవచ్చు. నవంబర్ 2015 లో 17,090 యూనిట్ల స్కూటర్లు అమ్ముడుపోయి ఐదవ స్థానంలో నిలిచింది.

        ఇంజన్ వివరాలు: 109సీసీ కెపాసిటి గల ఇంజన్ 6బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.

        మైలేజ్: ఇది లీటర్‌కు 66 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.

        ఆన్ రోడ్ ధర: రూ. 55,000 లు

        04.హీరో డ్యూయెట్

        04.హీరో డ్యూయెట్

        ఈ మధ్యనే హీరో మోటో కార్ప్ వారు విడుదల చేసిన హీరో డ్యూయెట్ స్కూటర్ మంచి అమ్మకాలనే సాధించింది. గడిచిన 2015 నవంబరులో డియో స్కూటర్ కన్నా ఎక్కువగా 18,240 యూనిట్లు అమ్ముడుపోయాయి.

        • ఇంజన్ వివరాలు: 110సీసీ కెపాసిటి గల ఇంజన్ 8.3బిహెచ్‌పి పవర్ మరియు 8.3 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
        • మైలేజ్: ఇది లీటర్‌కు 63 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
        • ఆన్ రోడ్ ధర: రూ. 55,000 లు
        • 03.హీరో మాయెస్ట్రో

          03.హీరో మాయెస్ట్రో

          మూడవ స్థానంలో ఉన్న హీరో మాయెస్ట్రో స్కూటర్ నవంబర్ 2015 లో 35,672 యూనిట్లు అమ్మకాలు నమోదు చేసుకుంది. అంతకు ముందు ఏడాది 2014 లోని నవంబర్ అమ్మకాలు 41,959 గా నమోదు అయ్యాయి.

          • ఇంజన్ వివరాలు: 109సీసీ కెపాసిటి గల ఇంజన్ 8.2బిహెచ్‌పి పవర్ మరియు 9.1 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
          • మైలేజ్: ఇది లీటర్‌కు 68 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
          • ఆన్ రోడ్ ధర: రూ. 55,000 లు
          • 2. టివియస్ జూపిటర్

            2. టివియస్ జూపిటర్

            రెండవ స్థానంలో ఉన్న స్కూటర్ టివియస్ జూపిటర్ 2014 నవంబర్ అమ్మకాలతో పోల్చుకుంటే 2015 ఇదే నెలలో 61 శాతం అధికంగా 51,768 యూనిట్లు అమ్మకాలు నమోదు అయ్యాయి.

            • ఇంజన్ వివరాలు: 109సీసీ కెపాసిటి గల ఇంజన్ 7.8బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
            • మైలేజ్: ఇది లీటర్‌కు 62 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
            • ఆన్ రోడ్ ధర: రూ. 54,000 లు
            • 1. హోండా ఆక్టివా

              1. హోండా ఆక్టివా

              ప్రతి నెలలాగే 2015 నవంబర్‌లో కూడా బారీగా అమ్మకాలు చేపట్టి టాప్-10 బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో ఈ సారి కూడా మొదటి స్థానంలో నిలిచింది. భారత దేశంలో అత్యంధిక అమ్మకాలు సాధిస్తున్నఏకైక స్కూటర్ హోండా ఆక్టివా. 2015 నవంబర్‌లో ఏకంగా 1,83,824 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.

              • ఇంజన్ వివరాలు: 109సీసీ కెపాసిటి గల ఇంజన్ 8బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేస్తుంది.
              • మైలేజ్: ఇది లీటర్‌కు 66 కిలోమీటర్లు మైలేజ్ ఇవ్వగలదు.
              • ఆన్ రోడ్ ధర: రూ. 53,000 లు
              • నవంబర్ 2015 లో టాప్-10 బెస్ట్ స్కూటర్లు ఇవే

                ఇది 2015 నవంబర్‌ నెలకు సంభందించిన స్కూటర్ల అమ్మకాలకు చెందిన సమాచారం. ఇది మీకు ఉత్తమ స్కూటర్‌ను ఎంపిక చేసుకోవడంలో సహాయపడుతుందని మా అభిప్రాయం. 2015 డిసెంబర్ అమ్మకాలకు చెందిన టాప్-10 స్కూటర్లకు చెందిన సమాచారం త్వరలోనే వెలువరిస్తాము. మాతో కలసి ఉన్నందుకు ధన్యవాదములు.

Article Published On: Friday, January 1, 2016, 19:18 [IST]
English summary
Top 10 Selling Scooters In November 2015
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+