ఫిబ్రవరిలో అత్యధికంగా అమ్మకాలు సాధించిన టాప్-10 టూవీలర్లు
2016 సంవత్సరపు కాలగర్భంలో మరొక మాసం కలిసిపోయింది. గత నెలలో వివిధ రకాల టూ వీలర్లల తయారీదారులు ఆశించిన స్థాయిలో తమ ఉత్పత్తుల అమ్మకాలు జరిపారు. ఎప్పటిలాగే హోండా వారి ఆక్టివా మాత్రం గరిష్ట అమ్మకాలు సాధించి టాప్-10 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.
అయితే చాలా వరకు ఇతర టూ వీలర్లు జనవరి అమ్మకాలతో పోల్చితే తారు మారుగా ఫలితాలను సాధించాయి. ఈ టాప్-10 జాబితాలో ఏయే టూ వీలర్లు ఉన్నయో ఓ చూపు చూద్దాం రండి.

10. బజాజ్ సిటి100
బజాజ్ వారి బడ్జెట్ మోటార్ సైకిల్ 2016 ఫిబ్రవరి నెలలో 42,924 యూనిట్ల అమ్మకాలు జరిగి 10 వ స్థానంలో నిలిచింది. బెస్ట్ మైలేజ్ టూవీలర్ల సెగ్మెంట్లో ఇది మంచి అమ్మకాలు నమోదు చేసుకుంది.
ఇంజన్: 99.2సీసీ, 8 బిహెచ్‌పి మరియు 8 ఎన్ఎమ్ టార్క్ విడుదల చేయును
మైలేజ్ : 89 కిలోమీటర్లు
ఆన్ రోడ్ ధర: రూ. 41,000 లు

09. బజాజ్ పల్సర్
బజాజ్ వారి రెండవ ఉత్పత్తి టాప్-10 జాబితాలో చోటు సాధించింది. బజాజ్ తమ పల్సర్‌ను వివిధ రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అయితే మొత్తం మీద 47,208 యూనిట్ల అమ్మకాలు జరిపి తొమ్మిదవ స్థానంలో నిలిచింది.
- ఇంజన్: 135సీసీ, 13 బిహచ్‌పి మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయును
- మైలేజ్: 64 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 71,000 లు
- ఇంజన్: 109సీసీ, 8 బిహెచ్‌పి, 8 ఎన్ఎమ్ గరిష్ట టార్క్
- మైలేజ్: 62 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 55,000 లు
- ఇంజన్: 125సీసీ. 10బిహెచ్‌పి పవర్ మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- మైలేజ్: లీటర్‌కు 65 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 63,000 లు
- ఇంజన్: 125సీసీ, 8 బిహెచ్‌పి, 10 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ విడుదల చేయును.
- మైలేజ్: 55 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 63,500 లు
- ఇంజన్: 70 సీసీ, 3.5 బిహెచ్‌పి మరియు 5 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయును
- మైలేజ్: 66 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 35,000 లు
- ఇంజన్: 97 సీసీ, 7 బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- మైలేజ్: 84 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 58,000 లు
- ఇంజన్: 97 సీసీ, 7.7 బిహెచ్‌పి, 8 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- మైలేజ్: 83 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 50,000 లు
- ఇంజన్: 97సీసీ, 7.4 బిహెచ్‌పి పవర్ మరియు 8 ఎన్ఎమ్ టార్క్‌ను విడుదల చేయును.
- మైలేజ్: 81 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 53,000 లు
- ఇంజన్: 109సీసీ, 8 బిహెచ్‌పి పవర్ మరియు 8.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.
- మైలేజ్: 66 కిలోమీటర్లు
- ఆన్ రోడ్ ధర: రూ. 53,000 లు
- లీఫు నెలలో దుమ్ము లేపిన కార్ల అమ్మకాలు
- ఏ బైకు ఎంచుకోవాలి అనే అయోమయంలో ఉన్నారా ?
- ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇవ్వగల 8 డీజల్ కార్లు

08. టీవీఎస్ జూపిటర్
టీవీఎస్ వారి బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ జూపిటర్ 47,712 యూనిట్ల అమ్మకాలు సాధించి ఎనిమిదవ స్థానంలో నిలిచింది. అయితే బజాజ్ పల్సర్ అమ్మకాల కన్నా ఇది ఎక్కువ.

07. హోండా షైన్
హోండా వారి షైన్ మోటార్ సైకిల్ టాప్-10 జాబితాలో ఏడవ స్థానంలో నిలిచింది. హోండా నుండి చాలా కాలం నుండి టాప్-10 జాబితాలో ఉంటూనే వస్తోంది. అందులో గత ఫిబ్రవరి నెలలో 58,433 యూనిట్ల అమ్మకాలు జరిపింది. హోండా తమ షైన్ బైకులో కాంబి బ్రేక్ సిస్టమ్‌ని అందించింది.

6. హీరో గ్లామర్
హీరో మోటోకార్ప్‌కు చెందిన గ్లామర్ 2016 ఏడాది ఫిబ్రవరి నెలలో టాప్-10 అమ్మకాల జాబితాలో ఆరవ స్థానంలో నిలిచింది. హీరో గ్లామర్ గడిచిన నెలలో 60,883 యూనిట్ల అమ్మకాలు జరిపింది.
గ్లామర్ టూ వీలర్ డ్రమ్ మరియు డిస్క్ బ్రేకులతో అందుబాటులో ఉంది.

5. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్
టాప్-10 జాబితాలో మరొక టీవీఎస్ వారి ఉత్పత్తి ఐదవ స్థానంలో ఉంది. టూ వీలర్లకు మరియు స్కూటర్లకు పోటిగా అమ్మకాలు సాధిస్తూ టాప్-10 జాబాతిలో స్థానం దక్కించుకుంది. ఇది 2-స్ట్రోక్ మరియు 4-స్ట్రోక్ ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

4. హీరో ప్యాసన్
టాప్-10 జాబితాలో నాలుగవ స్థానంలో ఉంది హీరో ప్యాసన్ టూ వీలర్. ఇది గత నెలలో 81,656 యూనిట్ల అమ్మకాలు సాధించింది.

3. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
కార్ల మార్కెట్లో మారుతి ఎలాంటిదో, టూ వీలర్ల మార్కెట్లో కూడా హీరో మోటోకార్ప్ అలాంటిదే అని చెప్పవచ్చు. హీరో వారి వరుస ఉత్పత్తి టాప్-10 జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. హీరో వారి హెచ్‌ఎఫ్ డీలక్స్ గత నెలలో ఏకంగా 1,06,572 యూనిట్ల అమ్మకాలు జరిపింది.

2. హీరో స్ల్పెండర్
మీరు అనుకున్నట్లుగానే రెండవ స్థానంలో హీరో వారి మరొక ఉత్పత్తి స్ల్పెండర్ టాప్-10 లో రెండవ స్థానంలో నిలిచింది. అంతే కాదు హీరో మోటోకార్ప్ వారి ఉత్తమ అమ్మకాలు సాధిస్తున్న బైకు కూడా. గడిచిన ఫిబ్రవరి నెలలో 1,89,314 యూనిట్ల హీరో స్ల్పెండర్ బైకులు అమ్ముడుపోయాయి.

1. హోండా ఆక్టివా
మీరు నమ్మినా, నమ్మకపోయినా హోండా ఆక్టివా మొదటి స్థానంలో ఉంది అనేది అక్షరాల నిజం. ఎప్పటిలాగే ఆక్టివా అన్నింటి కన్నా భారీ స్థాయిలో 2,10,028 యూనిట్ల అమ్మకాలు జరిపి టాప్-10లో మొదటి స్థానంలో నిలిచింది. అది కూడా కేవలం 29 రోజులు మాత్రమే గల ఫిబ్రవరి నెలలో.



Click it and Unblock the Notifications








