జనవరిలో టాప్-10 అమ్మకాలు సాంధించిన టూవీలర్లు

By Anil

భారతీయ రవాణా రంగంలో టూ వీలర్లు ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. దగ్గర ప్రాంత ప్రయాణాలకు ప్రజలు ఎక్కువగా టూ వీలర్ల మీద ఆధారపడుతున్నారు. వీరి అవసరాలకు తోడుగా దేశ వ్యాప్తంగా వివిధ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు విపరీతమైన పోటిపడుతున్నాయి. అందులో హోండా మరియు హీరో సంస్థలు ఉత్తమ మైలేజ్ ఇవ్వగల భారీ ఉత్పత్తులను మార్కెట్లోకి అందిస్తున్నారు.
Also Read: 5,000 రుపాయల డిస్కౌంట్‌తో బజాజ్ వారి బెస్ట్ మైలేజ్ టూ వీలర్
అయితే చాలా సంస్థలు వారి ఉత్పత్తులను భారీ స్థాయిలో అందుబాటులో ఉంచారు. భారతీయులు 2016 జనవరిలో ఎక్కువగా కొనుగోలు చేసిన టాప్-10 టూ వీలర్ల గురించి క్రింది శీర్షిక ద్వారా తెలుసుకోండి. ఈ కథనం ద్వారా ఏ టూ వీలర్ ఎంచుకోవాలి అనే సంధిగ్దంలో ఉన్న వారికి సమాధానం దొరకుతుంది.

10. టీవీఎస్ జూపిటర్

10. టీవీఎస్ జూపిటర్

10 వ స్థానంలో ఉన్న టీవీఎస్ జూపిటర్ స్కూటర్ గత జనవరి అమ్మకాలలో 42,838 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. ప్రస్తుతం స్కూటర్లసెగ్మెంట్లో అత్యంధికంగా అమ్మకాలు సాగిస్తున్న వాటిలో ఇది ఒకటి అందుకే కాబోలు టూ వీలర్లతో పాటు పోటి పడి టాప్-10 స్థానంలో చోటు దక్కించుకుంది.

09. బజాజ్ పల్సర్

09. బజాజ్ పల్సర్

తొమ్మిదవ స్థానంలో ఉన్న బజాజ్ పల్సర్ బైకు గత నెలలో 46,314 యూనిట్ల అమ్మకాలు జరిగాయి. దేశంలో యువత వివిధ రకాల డిజైన్ మరియు రకరకాల ఇంజన్ ఆప్షన్లు గల వాటిని కోరుకుంటున్నారు. అందుకోసం బజాజ్ సంస్థ పల్సర్ పేరు మీద రకరకాల డిజైన్లను మరియు ఇంజన్ఆప్షన్లతో అందిస్తోంది.

08. హీరో మాయెస్ట్రో

08. హీరో మాయెస్ట్రో

ఎనిమిదవ స్థానంలో నిలిచిన హీరో మాయెస్ట్రో స్కూటర్ గత నెలలో దాదాపుగా 48,002 యూనిట్లు అమ్ముడుపోయాయి. మరియు హీరో వారి ఏకైక్ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ కూడా ఇదే.

07. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్

07. టీవీఎస్ ఎక్స్‌ఎల్ సూపర్

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఏకైక 2-స్ట్రోక్ టూ వీలర్ ఇదే. ఈ ఎక్స్‌ఎల్ సూపర్ 53,849 యూనిట్ల అమ్మకాలు జరిపి ఏడవ స్థానంలో నిలిచింది. అయితే ఈ మధ్యనే టీవీఎస్ టూ వీలర్స్ ఈ మోపెడ్‌‌లలో 4-స్ట్రోక్ ఇంజన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

06. హీరో గ్లామర్

06. హీరో గ్లామర్

హీరో వారి గ్లామర్ టూ వీలర్ టాప్-10 బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్లలో ఆరవ స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాది జనవరి అమ్మకాలతో పోల్చుకుంటే ఇది 54 శాతం వృద్దితో 63,009 యూనిట్ల అమ్మకాలు జరిపి నాలుగు స్థానాలకు పైబడింది.

05. హోండా సిబి షైన్

05. హోండా సిబి షైన్

హోండా సిబి షైన్ జనవరిలో 76,562 యూనిట్లు అమ్మకాలు జరిపి ఐదవ స్థానంలో నిలిచింది. అయితే గత ఏడాది ఇదే నెలలో 62,176 యూనిట్ల అమ్మకాలు జరిపింది. షైన్ అమ్మకాలలో 23 శాతం వృద్దిని నమోదు చేసుకుంది.

04. హీరో ప్యాసన్

04. హీరో ప్యాసన్

నాలుగవ స్థానంలో ఉన్న హీరో వారి మరొక టూ వీలర్ ప్యాసన్. ఇది గత నెలలో 1,02,343 యూనిట్లు అమ్మకాలు జరిపింది.

03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

03. హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్

హీరో వారి మరొక ఉత్పత్తి హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎకంగా 1,07,272 యూనిట్లు అమ్మకాలు జరిపింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోల్చితే 94,376 యూనిట్లు అమ్ముడుపోయాయి.

 02. హీరో స్ల్పెండర్

02. హీరో స్ల్పెండర్

హీరో మోటోకార్ప్ వారి వరుసగా మరొక ఉత్పత్తి స్ల్పెండర్. టాప్-10 లో రెండవ స్థానంలో నిలిచిన ఇది హీరో వారి అతి ఉత్తమ అమ్మకాలు సాధించే టూ వీలర్‌గా పేరు గాంచింది. అయితే ఎంతో కాలంగా ఇది ఇలాగే రెండవ స్థానాన్ని కొనసాగిస్తూ వస్తోంది.

01. హోండా ఆక్టివా

01. హోండా ఆక్టివా

దేశీయ మార్కెట్లోకి బైకుల తరువాత స్కూటర్లు పరిచయం అయ్యాయి. కాని స్కూటర్ల మార్కెట్లోకి హోండా వారి ఆక్టివా అడుగుపెట్టిన తరువాత నెం. అమ్మకాలు సాధిస్తున్న ఏకైక టూ వీలర్‌గా ప్రతి నెలా ఎంపికై భారీ అమ్మకాలు సాధిస్తోంది. గత జనవరి అమ్మకాలలో ఏకంగా 2,10,123 యూనిట్ల ఆక్టివా కొనుగోళ్లు జరిగాయి.

తీర్పు

తీర్పు

మార్కెట్లో ఎన్నో రకాల బైకులు మరియు స్కూటర్లు అందుబాటులో ఉన్నాయి. కాని కేవలం అత్యధికంగా అమ్ముడైన ద్వి చక్రవాహనాల జాబితాలో ఇవి ఉన్నాయి. యావత్ దేశం మొత్తం ప్రజల యొక్క అభిరుచి ఇదే మరి. మరి మీరు ఇందులో దేనిని ఎంచుకుంటారు.

టాప్-10 బెస్ట్ టూ వీలర్స్
  • పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
  • ఆశ్చర్యం కలిగించే ధరతో విడుదలైన 150సీసీ బజాజ్ వి15 బైకు
  • రెనో క్విడ్ కారు ఆవిష్కరణ వెనకున్న.... ఆసక్తికరమైన సమాచారం !

More from DriveSpark

Article Published On: Tuesday, March 1, 2016, 12:23 [IST]
English summary
Top 10 Selling Two-Wheelers In January 2016
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+