బిగ్ డాగ్ ఈస్ బ్యాక్: 59 లక్షల ఖరీదైన కె9 రెడ్ చాపర్ ఇండియాలో విడుదల
ప్రముఖ కస్టమ్ బైక్స్ బిల్డర్ బిగ్ డాగ్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లోకి అత్యంత ఖరీదైన కె9 రెడ్ చాపర్ బైకును విడుదల చేసింది. దీని ప్రారంభ దర రూ. 59 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
అమెరికా ఆధారిత ప్రముఖ కస్టమ్ బైక్ బిల్డర్ అయినటువంటి బిగ్ డాగ్ మోటార్ సైకిల్ ఇండియన్ మార్కెట్లోకి తమ కె9 రెడ్ చాపర్ మోటార్ సైకిల్‌ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 59 లక్షలు ఉన్నట్లు సంస్థ తెలిపింది.

సాంకేతికంగా బిగ్ డాగ్ మోటార్‌సైకిల్ నిర్మించిన కె9 రెడ్ చాపర్ బైకులో 1,807సీసీ సామర్థ్యం గల (45-డిగ్రీల ఓవర్ హెడ్ వాల్వ్) వి-ట్విన్ ఇంజన్ కలదు. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

దీనికి ముందువైపున్న 41ఎమ్ఎమ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, ఇది కస్టమ్ మేడ్ చాపర్ బైకు అని స్పష్టం చేస్తుంది. దీని సీటు కేవలం 244ఎమ్ఎమ్ ఎత్తులో మాత్రమే ఉంది.

ఇందులో ముందువైపున 4-పిస్టన్ల డిఫరెన్షియల్ బోర్ సింగల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 4-పిస్టన్ల స్టాండర్డ్ బోర్ సింగల్ డిస్క్ బ్రేక్ కలదు. రెండింటిని కూడా పెర్ఫామెన్స్ మెషీన్ నుండి గ్రహించారు.

టైర్ల విషయానికి వస్తే, ముందు వైపున ఎమ్‌హెచ్90-21 56వి మరియు వెనుక వైపున 250/40విఆర్18(81V) టైరు కలదు. రెండు టైర్లను కూడా కోబ్రా సంస్థ నుండి సేకరించారు.

గరిష్ట పనితీరు కనబరచడం, ఆన్ రోడ్ క్రూయిజర్లను మరియు చాపర్లను నిర్మించడంలో బిగ్ డాగ్ మోటార్‌సైకిల్ సంస్థ బాగా పేరు గడించింది.

బిగ్ డాగ్ మోటార్‌సైకిల్ సంస్థ 1994 లో స్థాపించబడింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కస్టమ్ బిల్ట్ మోటార్ సైకిళ్లను గరిష్టంగా విక్రయించిన వాటిలో ఇది మొదటి స్థానంలో ఇంది. బిగ్ డాగ్ మోటార్‌సైకిల్ ఇప్పటి వరకు 30,000 బైకులను డెలివరీ ఇచ్చింది.

బిగ్‌డాగ్‌ఈస్‌బ్యాక్.కామ్ అనే పేరుతో పిలువబడుతున్న కనాసా మోటార్ వర్క్స్ (KMW) ఈ కె9 రెడ్ చాపర్ బైకును నిర్మించింది.

కె9 రెడ్ చాపర్ విడుదల వేదిక మీద సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ, తర్వాత కస్టమర్లకు అనుగుణంగా సీటు, హ్యాండిల్ బార్, డ్రాగ్ పైపులు, విశాలమైన టైర్ల మరియు ఇతర భాగాలను కస్టమైజ్ చేయనున్నట్లు తెలిపారు.

- సరికొత్త గ్రాండ్ ఐ10, ఎక్సెంట్ మరియు వెర్నా విడుదల వివరాలు
- లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేస్తున్నారా..? అయితే ఖచ్చితంగా వీటిని పాటించాల్సిందే !!
- బజాజ్ డొమైనర్ 400 కు పోటీని సిద్దం చేసిన టీవీఎస్: విడుదల తేదీ కూడా ఖరారు


Click it and Unblock the Notifications








