దేశీయంగా జి310ఆర్‌ విడుదల తేదీని ప్రకటించిన బిఎమ్‌డబ్ల్యూ

By Anil

బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ మొత్తానికి తమ జి310ఆర్ మోటార్ సైకిల్‌ను దేశీయంగా విడుదల చేయనున్న తారీఖుని ప్రకటచింది. బిఎమ్‌డబ్ల్యూ వారి అతి తక్కువ కెపాసిటి గల జి310ఆర్ బైకును అక్టోబర్ 2016 న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

దేశీయ టూ వీలర్ల తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ సమక్షంలో బిఎమ్‌డబ్ల్యూ దీనిని అభివృద్ది చేసింది. దీనికి టీవీఎస్ ఆధ్వర్యంలో దేశీయంగా పరీక్షలు కూడా నిర్వహించారు. బిఎమ్‌డబ్ల్యూ మరియు టీవీఎస్ సంయుక్తంగా దీనిని 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించారు. దీని గురించి పూర్తి వివరాలు క్రింది కథనం ద్వారా తెలుసుకుందాం రండి.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకులో 313 సీసీ సామర్థ్యం ఉన్న లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్‌ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

ఇందులోని ఇంజన్ సుమారుగా 34 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

ఇందులోని ఇంజన్ విడుదల చేసే పవర్ మరియు టార్క్‌ను వెనుక చక్రానికి అందివ్వడానికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను అనుసంధానం చేశారు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ లో ఫీచర్ల పరంగా అప్ సైడ్ ఫ్రంట్ ఫోర్క్స్, మోనో షాక్ అబ్జార్వర్లు, పూర్తి స్థాయిలో డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, 17 అంగుళాల అల్లాయ్ చక్రాలు మరియు 12 వోల్ట్‌ల ఛార్జింగ్ సాకెట్ కలదు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

భద్రత పరంగా యాంటి లాక్ బ్రేకింగ్ వ్యవస్థ గల డిస్క్ బ్రేకులు రెండు చక్రాలకు, ఎల్‌ఇడి లైట్లు గల టర్న్ సిగ్నల్స్ కలవు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

ఇది ఇండియన్ మార్కెట్లోకి విడుదలయితే ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో ఉన్న కెటిఎమ్ డ్యూక్ 390 మరియు బెనెల్లీ టిఎన్‌టి300 వంటి ఉత్పత్తులకు పోటీగా నిలవనుంది.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైకు లీటర్‌కు 36 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇవ్వగలదు, మరియు ఇందులో 11 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన ట్యాంకు కలదు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

బిఎమ్‌డబ్ల్యూ ఈ జి310ఆర్ బైకును సుమారుగా 2.7 నుండి 3 లక్షల మధ్య ధరతో విడుదల చేయవచ్చు.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

బిఎమ్‌డబ్ల్యూ ఈ డి310ఆర్ బైకును 2016 అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అంత వరకు డ్రైవ్‌స్పార్క్‌ తెలుగుతో కలిసి ఉండండి.

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ విడుదల తేదీ ఖరారు

హ్యార్లీ డేవిడ్‌సన్ నుండి మొదటి ఎలక్ట్రిక్ బైక్

నూతన ఆశలతో సరికొత్త డ్రైవింగ్ అనుభవం కలిగించే: హోండా నవీ రివ్యూ

Article Published On: Wednesday, June 15, 2016, 18:07 [IST]
English summary
BMW G310R India Launch Date Revealed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+