సూపర్‌ఛార్జ్‌డ్ ఆర్5 హోమ్మేజ్ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించిన బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్
బిఎమ్‌డబ్ల్యూ దీని పేరు వినగానే బ్రాండ్‌కు ఒక చిరునామాగా నిలిచిపోయింది. ఈ బ్రాండ్ పేరు మీద అత్యంత ఖరీదైన కార్లను మాత్రమే కాదు బైకులను కూడా తయారు చేస్తోంది. బిఎమ్‌డబ్ల్యూ 1936 కాలానికి చెందిన ఆర్5 హోమ్మేజ్ బైకును ఉత్తర ఇటలీలోని d'Eleganza Villa d'Este అనే ప్రాంతంలో ఘనంగా ఆవిష్కరించింది.

పురాతణ ఆర్5 మోడల్ బైకుకు తిరిగి ప్రాణం పోస్తూ మునుపటి డిజన్‌లకు భిన్నంగా మరింత నూతనత్నవాన్ని జోడించి ఎంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దింది. అలాగే కొన్ని ఆధునిక సొబగులను కూడా ఇది పొందింది. హ్యాండిల్ బార్‌కు చివరిలో బ్రేక్ మరియు క్లచ్ లీవర్లను కల్పించింది.
Also Read: సమర్థవంతమైన దాడి చేయగల ప్రపంచ టాప్ 10 సైనిక హెలికాప్టర్లు !
ఈ ఆర్5 బైకులో అసలైన 494 సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఇంజన్‌ను అందించింది బిఎమ్‌డబ్ల్యూ. ఈ ఇంజన్ సుమారుగా 24 బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేయును. దీని గరిష్ట వేగం గంటకు 135 కిలోమీటర్లుగా ఉంది.
Also Read: అంతర్జాతీయ ఆధిపత్యం దిశగా మారుతి బాలెనొ
నోరెన్ బ్రదర్స్ ఈ బైకు సంభందించిన ఇంజన్ మరియువ గేర్ బాక్స్‌లకు చెందిన డిజైన్ స్కెచ్‌లను కూడా అందించారు. అప్పట్లో ఈ బైకును ఒక సారి రేసింగ్ కోసం కూడా వినియోగించారు. ఆ రేసింగ్‌లో ఇది కొంచెం వరకు డ్యామేజ్‌కు గురయ్యింది. ఈ బైకులో ముందు మరియు వెనుక వైపున డిస్క్ బ్రేకులు ఉన్నాయి. రెండు వైపులా ఉన్న సస్పెన్షన్ వ్యవస్థ కూడా ఆ కాలానికి చెందినవే.


Click it and Unblock the Notifications






































